నా తప్పు లేకపోయినా అతను చెప్పుతో కొట్టి అవమానించాడు.. బండ్ల గణేష్ ఎమోషనల్ కామెంట్స్

by Mallepaka Hamsa |

ఆ రోజు కూడా ఎప్పటిలాగే ‘సార్.. సార్’ అంటూ ఎంతో మర్యాదగా చేతులు కట్టుకొని ఆయన ముందు కూర్చున్న. కానీ, ఏమైందో ఏమో తెలియదు.. సడెన్ గా ఆయన తన కాలి చెప్పు తీసుకొని నన్ను కొట్టాడు.

నా తప్పు లేకపోయినా అతను చెప్పుతో కొట్టి అవమానించాడు.. బండ్ల గణేష్ ఎమోషనల్ కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ నిర్మాత బండ్ల గణేష్ సినిమా ఇండస్ట్రీలో ఒక చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి.. ‘గబ్బర్ సింగ్’, ‘బాద్‌షా’, ‘టెంపర్’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో టాలీవుడ్‌లోనే అత్యంత క్రేజీ ప్రొడ్యూసర్‌గా ఎదిగిన ఆయన ప్రయాణం వెనుక ఎన్నో కన్నీళ్లు, అవమానాలు ఉన్నాయట. తాజాగా ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న బండ్ల గణేష్.. ఇప్పటివరకు ఎవరికీ తెలియని ఒక అత్యంత ఘోరమైన అవమానకరమైన సంఘటనను బయటపెట్టి అందరినీ షాక్‌కు గురిచేశారు. ‘‘ఇండస్ట్రీలో ఒక పెద్ద మనిషి ఉండేవారు.. ఇప్పుడు ఆయన పేరు చెప్తే బాగోదు. అప్పట్లో నేను సరదాగా ఆయన దగ్గరకు వెళ్లి కూర్చునేవాడిని. ఆ రోజు కూడా ఎప్పటిలాగే ‘సార్.. సార్’ అంటూ ఎంతో మర్యాదగా చేతులు కట్టుకొని ఆయన ముందు కూర్చున్న. కానీ, ఏమైందో ఏమో తెలియదు.. సడెన్ గా ఆయన తన కాలి చెప్పు తీసుకొని నన్ను కొట్టాడు. నా వైపు నుండి ఎలాంటి తప్పు లేదు.. భగవంతుడి మీద ఒట్టేసి చెప్తున్నా.

నిజానికి ఆయన చాలా మంచోడే, అంతకుముందు నాకు చాలా సాయం కూడా చేశారు. కానీ, ఆ రోజు ఆయన ఏదో పర్సనల్ టెన్షన్ లేదా ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారు. ఆ సమయంలో నేను అక్కడ కనిపించేసరికి ఆ కోపాన్ని నాపై చూపించి అలా కొట్టేశారు. పాపం.. ఆయనకు కూడా తర్వాత గిల్టీగా అనిపించి రెండో రోజే నాకు సారీ చెప్పారు. కానీ, ఆ ఘటన నా మనసును తీవ్రంగా గాయపరిచింది’ అని తెలిపాడు. అంతే కాదు.. ఆ రోజు తన దగ్గర డబ్బు లేదు, సామాన్యుడు అనే కదా ఆయన తనను అలా కొట్టాడని తనలో కసి పెరిగిందని అన్నారు. ఏ రోజుకైనా ఆయన కంటే ఎక్కువ డబ్బు సంపాదించి చూపిస్తా.. లేకపోతే తన పేరు గణేష్ కాదు’’ అని తనకు తానే ఛాలెంజ్ చేసుకున్నట్లు తెలిపారు. అనుకున్నట్లుగానే రాత్రి పగలు కష్టపడి, వ్యాపారాలు చేసి, సినిమాలు తీసి ఆయన కంటే వంద రెట్లు ఎక్కువ డబ్బు సంపాదించి లైఫ్‌లో సక్సెస్ అయి చూపించానని బండ్ల గణేష్ పేర్కొన్నారు.

Next Story