బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా.. నన్ను నాలుగు సినిమాల్లో రిజెక్ట్ చేశారు.. హీరో షాకింగ్ కామెంట్స్

by Chukka Sudharani |

చాలా గ్యాప్ తర్వాత హీరో సుమంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘అనగనగా’.

బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా.. నన్ను నాలుగు సినిమాల్లో రిజెక్ట్ చేశారు.. హీరో షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: చాలా గ్యాప్ తర్వాత హీరో సుమంత్ (Sumanth) ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘అనగనగా’ (Anaganaga). సన్నీ సంజయ్ (Sunny Sanjay) దర్శకత్వం వహించిన ఈ మూవీ డైరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చి మంచి సక్సెస్ అందుకుంది. నేటి విద్యావ్యవస్థలోని లోపాలను, దాని తీరుతెన్నులను ప్రశ్నిస్తూ, తండ్రీ కోడుకుల మధ్య ఉన్న అనుబంధాన్ని చక్కగా భావోద్వేగభరితంగా చూపించడంతో.. వయసుతో సంబంధం లేకుండా అందరిని ఈ మూవీ ఆకట్టుంది. ఈ క్రమంలోనే ఈ సినిమాతో సక్సెస్‌తో వరుస ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు టీమ్.

ఇందులో భాగంగానే తాజాగా హీరో సుమంత్, డైరెక్టర్ సన్నీ సంజయ్ ఓ చిట్‌చాట్‌లో పాల్గొన్నారు. ఈ చిట్‌చాట్‌లో సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వాళ్లకు ఆడిషన్స్ చేస్తారా అనే ప్రశ్న ఎదురు కాగా.. సుమంత్ స్పందిస్తూ.. ‘సినీ బ్యాక్‌గ్రాండ్ ఉన్నా కూడా ఆఫర్లు రావడం కష్టమే అవుతుంది. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం ఈజీ కానీ.. నిలదొక్కడం కష్టం. ఓ స్థాయి వరకు బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాళ్లకు హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది తర్వాత.. ఎవ్వరైనా ఆడిషన్ ఇవ్వాల్సిందే. కొన్నాళ్ల క్రితం నేను కూడా నాలుగైదు హిందీ ప్రాజెక్టులకు ఆడిషన్స్ ఇచ్చా. రిజెక్ట్ అయ్యాను. హిందీ భాష రాకపోవడంతో వాళ్లు నన్ను రిజెక్ట్ చేశారు అనుకుంటున్నా. అంతే కానీ, బ్యాక్‌గ్రౌండ్ ఉంది కదా అని తీసేసుకోరు’ అని తెలిపాడు.

Next Story