- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈషా మూవీ రిలీజ్ డేట్ వాయిదా.. భయపడడానికి ఇంకొంచెం టైం ఉంది అంటూ నిర్మాత పోస్ట్..
ఇటీవల ‘రాజు వెడ్స్ రాంబాయి’(Raju Weds Rambayi) చిత్రంతో సూపర్‌హిట్ కొట్టిన అఖిల్‌రాజ్(Akhil Raj)తో పాటు త్రిగుణ్(Trigun) హీరోలుగా నటిస్తున్న చిత్రం ‘ఈషా’(Eesha).

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల ‘రాజు వెడ్స్ రాంబాయి’(Raju Weds Rambayi) చిత్రంతో సూపర్‌హిట్ కొట్టిన అఖిల్‌రాజ్(Akhil Raj)తో పాటు త్రిగుణ్(Trigun) హీరోలుగా నటిస్తున్న చిత్రం ‘ఈషా’(Eesha). శ్రీనివాస్ మన్నె(Srinivas Manne) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో హెబ్బా పటేల్(Hebah Patel) హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే ఇందులో సిరి హనుమంత్(Siri Hanmanth), పృథ్వీ రాజ్(Prithviraj) వంటి తదితరులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమాను వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు.
ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన టైటిల్ అనౌన్స్‌మెంట్(Title Annoncement), గ్లింప్స్(Glimps), ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో భయపెట్టాయి. అయితే ఈ చిత్రం డిసెంబర్ 12న థియేట్రికల్ రిలీజ్ కానుండగా ఇప్పుడు ఈ మూవీ వాయిదా పడినట్లు నిర్మాత బన్నీ వాసు ఎక్స్ వేదికగా వెల్లడించాడు.
ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ.. ‘ఈషా ఇప్పుడు డిసెంబర్ 25న వరల్డ్ వైడ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది.. ఈ క్రిస్మస్‌కి కచ్చితంగా మీకు భయం గ్యారెంటీ’ అని రాసుకొచ్చారు. ఇక పోస్టర్ మీద ‘భయపడడానికి ఇంకొంచెం టైం ఉంది.. కానీ భయం మాత్రం గ్యారెంటీ’ అని రాసి ఉంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.






