Eshanya Maheshwari: చీరకట్టులో హాట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బ్యూటీ

by Pulgam srinivas |

ఈశాన్య మహేశ్వరి గ్లామర్ షో.. గ్రే శారీలో అందాల విందు

Eshanya Maheshwari: చీరకట్టులో హాట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బ్యూటీ
X

దిశ, వెబ్ డెస్క్: మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ ఈశాన్య మహేశ్వరి ‘రాజుగారి గది’ సినిమాతో వెండితెరకు పరిచయమైంది. ఈ సినిమా తర్వాత ఆమె తమిళ్, హిందీ చిత్రాల్లో కూడా నటించి ప్రేక్షకులకు దగ్గరైంది.



అయితే ఈ మధ్యకాలంలో మహేశ్వరి వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించడం లేదు. కానీ సోషల్ మీడియా ద్వారా మాత్రం అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటోంది.




తనకు సంబంధించిన గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటూ వస్తున్న ఈ బ్యూటీ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని కొత్త ఫోటోలను షేర్ చేసింది.



అందులో గ్రే కలర్ పలుచటి చీరను ధరించి, దానికి మ్యాచ్ అయ్యే బ్లాక్ కలర్ స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లో స్టైలిష్‌గా కనిపించింది. పలుచటి చీరలో తన అందాలను హైలైట్ చేస్తూ ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఇక చేతికి గాజులు, చెవులకు ఇయర్‌రింగ్స్ ధరించి మరింత ఆకర్షణీయంగా మెరిసింది.




జుట్టును గాలికి వదిలేసి నవ్వుతూ ఇచ్చిన ఫోజులు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. మొత్తంగా ఈ ఫోటోలలో ఈశాన్య మహేశ్వరి సూపర్ లుక్‌లో కనిపించడంతో ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Photos Courtesy: Instagram

Next Story