- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Eesha Rebba : రెడ్ శారీలో రాయల్ లుక్‌తో మెస్మరైజ్ చేసిన ఈషా రెబ్బ
రెడ్ సిల్క్ చీరలో సంప్రదాయ లుక్‌తో కట్టిపడేస్తున్న ఈషా రెబ్బ.

దిశ, వెబ్ డెస్క్: అందాల తార ఈషా రెబ్బ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇప్పటివరకు ఈమె అనేక సినిమాల్లో నటించి, పలు వెబ్ సిరీస్‌ల ద్వారా ప్రేక్షకులను అలరించింది.
తాజాగా ఈ బ్యూటీ నటుడు, దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోగా తెరకెక్కిన ఓం శాంతి శాంతి శాంతిః చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకున్నప్పటికీ, భారీ స్థాయి విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది.
అయితే ఇందులో ఈమె తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సినిమాల్లో అప్పుడప్పుడు తన అందాలతో మెప్పించే ఈ నటి, సోషల్ మీడియాలో మాత్రం తరచూ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది.
అదే సమయంలో కొన్ని సందర్భాల్లో క్లాస్ లుక్‌లో ఉన్న ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఆకర్షిస్తోంది. తాజాగా ఈ నటి తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలను పంచుకుంది.
అందులో ఈషా రెబ్బ ఎరుపు రంగు సిల్క్ చీర ధరించింది. ఆ చీరకు ఉన్న గోల్డ్ బోర్డర్ కారణంగా ఆమె అందం మరింత పెరిగింది.
ఈ ఫోటోలలో ఈమె జుమ్కా చెవిపోగులు, బ్రేస్‌లెట్, చిన్న బొట్టు ధరించి చిరునవ్వుతో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. సంప్రదాయ లుక్‌లో ఉన్న ఈషా రెబ్బకి సంబంధించిన ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.
Photos Courtesy: Instagram






