- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమ్మాయి బ్యూటీని చూసి ఎంజాయ్ చేయండి.. కానీ కామెంట్ చేయకండి.. నటి దివి షాకింగ్ కామెంట్స్
బిగ్ బాస్ షో ద్వారా ఎంతోమంది ఫేమస్ అయ్యారు. అలా పాపులారిటీ సంపాదించుకుంది వారిలో దివి వడ్త్యా(Divya Vadthya) ఒకరు.

దిశ, వెబ్‌డెస్క్: బిగ్ బాస్ షో ద్వారా ఎంతోమంది ఫేమస్ అయ్యారు. అలా పాపులారిటీ సంపాదించుకుంది వారిలో దివి వడ్త్యా(Divi Vadthya) ఒకరు. అంతకముందు సినిమాల్లో చిన్న చిన్న రోల్ ప్లే చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల్లో నటించే స్థాయికి ఎదిగింది. మెయిన్‌గా సోషల్ మీడియాలో నెట్టింట బోల్డ్ డ్రెస్సులతో రచ్చ చేస్తూ ఉంటుంది ఈ అమ్మడికి ఫాలోవర్స్ కూడా చాలా ఎక్కువ మందే ఉన్నారు. అయితే రీసెంట్‌గా ఈ భామ నవీన్ చంద్ర(Naveen Chandra) నటించిన ‘హనీ’((Honey) సినిమాలో ఈ చిన్నది కూడా నటించింది.
‘పలాస’ చిత్రంతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కరుణ కుమార్(Karuna Kumar), వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్‌ను రూపొందించారు. ఇక ఇందులో దివ్య పిళ్లై, రాజా రవీంద్ర, మీరా వంటి వారు కీరోల్ ప్లే చేశారు. అయితే ఈ భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దివి వడ్త్యా షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘మనం బయట వేరే కంట్రికి వెళ్లినప్పుడు, లేకపోతే వేరే ప్లేస్‌లో ఉన్నప్పుడు, బీచ్‌లో ఉన్నప్పుడు ఎలాంటి అవుట్ ఫిట్ వేసుకుంటావో వేసుకో.
నువ్వు గుడికి వెళ్లినప్పుడు సంప్రదాయకంగా వెళ్లు. ఇప్పుడు నేను ఇంటర్వ్యూకు వచ్చా.. ఎలా రావోలో అలా వచ్చా.. అన్నీ కనిపించేలా విప్పుకొని రాలేగా. నేను చాలా మందిని చూశాను మన ఏజ్ వాళ్ళే అవ్వా నువ్వేంటి ఇలాంటి డ్రెస్సులు వేసుకున్నావు, నువ్వు ఇలాంటి బట్టలు వేసుకుంటే ఎవరు నిన్ను పెళ్ళి చేసుకుంటాడు, అని క్వశ్చన్ చేస్తారు. నిజంగా అది నాకు షాకింగ్‌గా అనిపిస్తుంది. గాయ్స్ మీరు చేంజ్ అవ్వండి అమ్మాయి బ్యూటీని చూసి ఎంజాయ్ చేయండి.. కానీ కామెంట్ చేయకండి’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.






