- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
OG కోసం విలన్ కష్టాలు...రోజుకు 16 గంటలు ఫాస్టింగ్, 5 రోజులు జిమ్ లోనే!
46 సంవత్సరాలు ఉన్న ఇమ్రాన్... ఈ సినిమా కోసం ప్రత్యేక డైట్ ఫాలో అవుతున్నారట. వారంలో ఐదు రోజులపాటు

దిశ, వెబ్ డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ గా నటించిన సినిమా OG. సుజిత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో ప్రియాంక హీరోయిన్ గా నటిస్తుండగా... ప్రొడ్యూసర్గా దానయ్య ఉన్నారు. అలాగే ప్రత్యేక పాత్రలో అర్జున్ దాస్, ఇమ్రాన్ హస్మి దుమ్ము లేపేందుకు సిద్ధమయ్యారు.
దాదాపు ఈ సినిమాలో ఇమ్రాన్ మెయిన్ విలన్ అని తేలిపోయింది. అయితే అతని గురించి తాజాగా ఓ విషయం బయటకు వచ్చింది. 46 సంవత్సరాలు ఉన్న ఇమ్రాన్... ఈ సినిమా కోసం ప్రత్యేక డైట్ ఫాలో అవుతున్నారట. వారంలో ఐదు రోజులపాటు జిమ్ చేయడంతో పాటు రోజుకు ఒక గంట నడుస్తానని... తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అలాగే లంచ్ సమయంలో కూరగాయలు, పప్పు, రోటీలు మాత్రమే తింటానని.. నైట్ చపాతీలు అసలు తినబోనని ఓజీ విలన్ ఇమ్రాన్ వెల్లడించారు.
చికెన్ లేదా కూరగాయలు, పప్పు పెరుగు లాంటివి రాత్రి తింటానని తెలిపారు. ఇక రోజుకు 16 గంటలు ఫాస్టింగ్ చేస్తున్నానని... 6 గంటలు మాత్రమే నిద్రపోతాను అని చెప్పుకొచ్చాడు. షుగర్ ఐటమ్స్ అస్సలు తీసుకోనని తెలిపారు. కేవలం OG సినిమా కోసమే తన లైఫ్ స్టైల్ మార్చుకున్నట్లు పేర్కొన్నారు. కాగా ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీన రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.






