వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో చీటింగ్.. వార్ 2, కూలీ సినిమాలకు ఉద్యోగులు వెళుతున్నారట?

by velandi.Saikiran |

కొంతమంది ఉద్యోగులు ఆఫీస్ కు వచ్చి డ్యూటీ చేసే ఛాన్స్ ఉన్నప్పటికీ... వర్షాల పేరుతో వర్క్ ఫ్రం హోమ్ తీసుకుంటున్నారట

వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో చీటింగ్.. వార్ 2, కూలీ సినిమాలకు ఉద్యోగులు వెళుతున్నారట?
X

దిశ, వెబ్ డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు హైదరాబాద్ మహానగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ భారీ వర్షాల నేపథ్యంలో.. ఇంటి నుంచి బయటకు ఎవరు వెళ్లడం లేదు. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో.. కాలనీలన్నీ జలమయం అవుతున్నాయి. రోడ్లు ఎవరు ఎక్కడం లేదు. భారీ వర్షాల నేపథ్యంలో... సాఫ్ట్ వేర్ ఉద్యోగులతో పాటు.. మిగతా చాలా రంగాల వారికి వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చేశారు.

దీంతో భారీ వర్షాలు పడుతున్నప్పటికీ తమ తమ ఇళ్లల్లోనే.. హాయిగా డ్యూటీ చేసుకుంటున్నారు హైదరాబాద్ మహానగరానికి సంబంధించిన ఉద్యోగులు. అయితే రెండు తెలుగు రాష్ట్రాలలో రేపు రెండు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. వార్ 2 తో పాటు రజనీకాంత్ నటించిన కూలీ రిలీజ్ కాబోతున్నాయి. అయితే ఈ సినిమాల నేపథ్యంలో... వర్క్ ఫ్రం హోం చేసే ఉద్యోగులందరూ.. థియేటర్లకు వెళ్తున్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది.

కొంతమంది ఉద్యోగులు ఆఫీస్ కు వచ్చి డ్యూటీ చేసే ఛాన్స్ ఉన్నప్పటికీ... వర్షాల పేరుతో వర్క్ ఫ్రం హోమ్ తీసుకుంటున్నారట. ఇక రేపటి నుంచి సినిమాలు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో... ఆ ఉద్యోగులంతా సినిమాలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ సంఘటనపై సోషల్ మీడియాలో మీమ్స్ వస్తున్నాయి. దీనిపై నెటిజెన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మేనేజర్లకు తెలియకుండా... భలే ప్లాన్ చేస్తున్నారు మైక్.. అంటూ ఉద్యోగులను పొగుడుతున్నారు. క్లిక్

Next Story