- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫైనల్లీ గర్ల్ ఫ్రెండ్‌ను పరిచయం చేసిన ఇమ్మాన్యుయేల్.. ఆ ఫొటోను షేర్ చేయడంతో కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు
కమెడియన్ ఇమ్మాన్యుయేల్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. జ

దిశ, వెబ్‌డెస్క్: కమెడియన్ ఇమ్మాన్యుయేల్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. జబర్దస్త్ షోలో ఎంతగానో నవ్వించిన ఆయనకు బిగ్ బాస్ సీజన్-9లో కంటెస్టెంగ్‌గా వెళ్లే అవకాశం వచ్చింది. అలా హౌస్‌లోకి అడుగుపెట్టిన ఆయన తన మార్క్ కామెడీతో ఆడియన్స్‌ని ఒక రేంజ్‌లో ఆకట్టుకున్నాడు. కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు బిగ్ బాస్ పెట్టిన ప్రతి టాస్కుల్లో కూడా తన హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాడు.
దీంతో ఈ సీజన్ విన్నర్ అతనే అన్ని చాలామంది ఫిక్స్ అయ్యారు. కానీ, బ్యాడ్ లక్ ఆయన కేవలం టాప్ 5తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే, ఇమ్మాన్యుయేల్ బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు తన లవ్ గురించి, తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి గురించి చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా తన లవర్ హ్యాండ్ పట్టుకున్న ఫొటోను షేర్ చేస్తూ ‘వేస్ట్ అమ్మ’ అనే క్యాప్షన్ జోడించాడు.
దీంతో ఆ పిక్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు ఈ కపుల్‌కి సోషల్ మీడియాలో కంగ్రాట్స్ చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ ఫొటోలో కేవలం ఆ అమ్మాయి చేయిని మాత్రమే చూపించాడు.. పేరు గానీ, ఫేస్ గానీ రివీల్ చేయలేదు. మరి ఇమ్మాన్యుయేల్ తనకు కాబోయే భార్యను ఎప్పుడు అందరికీ పరిచయం చేస్తాడు అనేది చూడాల్సి ఉంది.






