Emergency: ఎమర్జెన్సీ: ఇది బీజేపీ కథేనా?

by Yella Dhawani Reddy |   (  Updated:2025-03-15 07:00:34  IST  )

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగ‌నా రనౌత్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన మూవీ ఎమర్జెన్సీ(Emergency).

Emergency: ఎమర్జెన్సీ: ఇది బీజేపీ కథేనా?
X

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగ‌నా రనౌత్ (Kangana Ranaut) స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన మూవీ ఎమర్జెన్సీ(Emergency). దివంగత భారత ప్రధాని ఇందిరా గాంధీ (Late Indian Prime Minister Indira Gandhi) హయంలో దేశవ్యాప్తంగా విధించిన ఎమర్జెన్సీ పరిస్థితుల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందిరా గాంధీ పాత్రలో కంగనా రనౌత్, జయప్రకాష్‌ నారాయణ్‌ పాత్రలో అనుపమ్‌ ఖేర్‌, మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ పాత్రలో శ్రేయస్ తల్పడే నటించారు. జనవరి 17 థియేటర్లలో విడుదలైన ఈ మూవీ మార్చి 14 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతుంది. నిర్మాణమవుతున్నప్పటి నుంచే ఈ సినిమా వివాదాలను ఎదుర్కొంటుంది.

దివంగత ఇందిరా గాంధీ 1975-1977 మధ్య దేశంలో విధించిన అత్యవసర పరిస్థితి దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిస్థితులను ఎంత చిన్నా భిన్నం చేశాయో మనకు తెలుసు. సరిగ్గా ఇవే ఘటనలను సినిమాలో ప్రధాన కథగా మలిచారు. అయితే సినిమాలో చాలాచోట్ల ఆమెను నెగిటివ్‌గా చూపించారు. డేరింగ్ అండ్ డాషింగ్ ప్రధానిగా పేరు తెచ్చుకున్న ఇందిరా గాంధీ ప్రతిష్టకు భంగం కలిగించేలా పలు సన్నివేశాలు ఉన్నాయి. కేవలం ఇందిరా గాంధీనే కాదు.. నెహ్రూను కూడా చేతగాని ప్రధాని అన్న కోణంలో చెప్పడానికి యత్నించారు. 1962 భారత్-చైనా యుద్ధం తర్వాత జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా అస్సాంను నెహ్రూ పొరుగుదేశానికి అప్పగిస్తే ఇందిరా కాపాడినట్లు చూపించారు. ఇందిరా చిన్నకొడుకు సంజయ్ గాంధీని కూడా విలన్‌గా చూపించారు. సింపుల్‌గా చెప్పాలంటే.. నెహ్రూ కుటుంబాన్ని ఈ సినిమాలో స్వార్థపరులైన వ్యక్తులుగా చిత్రీకరించారు. అంతేకాదు, ఎమర్జెన్సీ సమయంలో ప్రజలు ఎదుర్కొన్న నిజమైన సమస్యలను, ఇందిర చేసిన మంచి పనులను సినిమాలో చూపించలేదు.

ఈ సినిమాపై కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. మొదటి నుంచి ఈ సినిమాను బ్యాన్ చేయాలని డిమాండ్ ఆ పార్టీ చేస్తున్నది. కారణం.. కంగనా రనౌత్ బీజేపీకి చెందిన ఎంపీ కాబట్టి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేలా అసత్యాలను సినిమాలో చూపిస్తారని అనుమానాలు వ్యక్తం చేసింది. తాము అనుమానించినట్లుగా ఎమర్జెన్సీ ఘటనలపై ఈ సినిమా తీసినట్లుగా లేదని, బీజేపీ భావజాలాన్ని ప్రచారం చేసుకునేందుకు తీసినట్లుగా ఉందని ఆందోళనలు చేస్తున్నారు.

Read More..

Betting Apps: సుప్రీత చేసింది.. రైటా రాంగా..?.. ఆమె చేసింది ఎంత వరకు కరెక్ట్..?

Next Story