ఎలిగెన్స్ అనేది ఒక శైలి కాదు, అది ఒక మానసిక స్థితి.. ఐశ్వర్య రాజేష్ ఆసక్తికర పోస్ట్

by I. Sairam |

హీరోయిన్ ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఎలిగెన్స్ అనేది ఒక శైలి కాదు, అది ఒక మానసిక స్థితి.. ఐశ్వర్య రాజేష్ ఆసక్తికర పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: హీరోయిన్ ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘కౌసల్య కృష్ణమూర్తి’(Kousalya Krishnamoorthi) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తన ఫస్ట్ మూవీతోనే మంచి ఫేమ్ తెచ్చుకుంది. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ అనుకున్నంతగా గుర్తింపు రాలేదు. అయితే రీసెంట్‌గా అనిల్ రావిపూడి(Anil Ravipudi) డైరెక్షన్‌లో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunnam) సినిమాతో మాత్రం ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. ఇక వెంకటేష్(Venkatesh) హీరోగా నటించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి(Meenakshi Chowdary) కూడా నటించింది.

అలాగే నిత్యం సోషల్ మీడియా(Social Media)లోనూ యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా ఐశ్వర్య తన ఇన్‌స్టా(Instagram) వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో శారీ కట్టుకుని హెయిర్ లీవ్ చేసుకుంది, అలాగే సింపుల్‌గా చేతికి ఒక్కో బ్యాంగిల్ వేసుకుని వయ్యారంగా చూస్తూ ఫొటోస్‌కి స్టిల్ ఇచ్చింది. ఇక వాటికి ‘ఎలిగెన్స్ అనేది ఒక శైలి కాదు, అది ఒక మానసిక స్థితి’ అనే క్యాప్షన్ జోడించింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు, ఆమె ఫ్యాన్స్ వావ్ క్యూట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు ఈ భామ పోస్ట్ పై ఓ లుక్ వేసేయండి.

Next Story