- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నెటిజన్ అసభ్యకర కామెంట్.. పోలీసులను ఆశ్రయించిన హీరోయిన్.. కేసు నమోదు
సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో ట్రోలింగ్స్, నెగిటివిటీ కొత్తేమీ కాదు.

దిశ, సినిమా: సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో ట్రోలింగ్స్, నెగిటివిటీ కొత్తేమీ కాదు. అయితే కొంత మంది సెలబ్రిటీలు వాటిని పట్టించుకోకుండా వాళ్ల పని వాళ్లు చూసుకుంటారు. కానీ మరికొందరు మాత్రం వార్నింగ్ ఇవ్వడం లాంటివి చేస్తుంటారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో తను పెట్టిన పోస్ట్‌కు ఓ నెటిజన్ అసభ్యకర కామెంట్ పెట్టడంతో ఏకంగా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది హీరోయిన్ ఈషా రెబ్బ. తను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్‌కు ఓ నెటిజన్ అసభ్యంగా కామెంట్ పెట్టాడని పోలీసులను ఆశ్రయించింది. అతడి ఐడీతో పాటు కామెంట్‌ను చూపించడంతో.. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అయితే.. ఒక వ్యక్తి ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఇలా బ్యాడ్‌గా మెసేజులు చేస్తున్నట్లు తెలిపిన పోలీసులు.. దీనిపై విచారణ జరుపుతున్నారు. కాగా.. ఈషా రీసెంట్‌గా ‘ఓం శాంతి శాంతి శాంతిః’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన ఈ మూవీకి ఏఆర్ సజీవ్ దర్శకత్వం వహించాడు. జనవరి 30న రిలీజైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.
Glamorous Clicks of Actresses
- Tags
- eesha rebba






