- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఊహకందని చీకటి ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది.. ఆసక్తికరంగా ఈషా ట్రైలర్
ఇటీవల లిటిల్‌హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి లాంటి సూపర్‌హిట్ కల్ట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన బన్నీవాస్, వంశీ నందిపాటి ద్వయం తాజాగా 'ఈషా' పేరుతో హారర్ థ్రిల్లర్ ‘ఈషా’ను ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నారు. వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్‌పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్‌గా ఈ చిత్రాన్ని డిసెంబరు 12న థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు.

దిశ, సినిమా : ఇటీవల లిటిల్‌హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి లాంటి సూపర్‌హిట్ కల్ట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన బన్నీవాస్, వంశీ నందిపాటి ద్వయం తాజాగా 'ఈషా' పేరుతో హారర్ థ్రిల్లర్ ‘ఈషా’ను ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నారు. వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్‌పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్‌గా ఈ చిత్రాన్ని డిసెంబరు 12న థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. అఖిల్ రాజ్, త్రిగుణ్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో హెబ్బాపటేల్ కథానాయిక. హెచ్‌వీఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీనివాస్ మన్నె దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు మేకర్స్.
ఇది రెగ్యులర్ హారర్ ఫార్ములాకు భిన్నంగా ఉండగా.. మీరు ఊహించని చీకటి ప్రపంచం మరొకటి ఉంది అంటూ ట్రైలర్ ఆసక్తికరంగా మొదలైంది. దెయ్యాలు, ఆత్మలు లేవని బలంగా నమ్మే స్నేహితుల చుట్టూ తిరిగే కథలో ప్రేక్షకులు ఉలిక్కిపడే ట్విస్ట్‌లు పుష్కలంగా ఉన్నాయనిపిస్తుంది. సమాజంలో ఉన్న మూఢనమ్మకాలను, దొంగ బాబాలను ఎక్స్‌పోజ్ చేయడానికి బయలుదేరిన ఫ్రెండ్స్.. బబ్లూ పృథ్వీరాజ్ రూపంలో విసిరే ఛాలెంజ్‌తో ఓ చీకటి ప్రపంచంలోకి అడుగుపెడతారు. సైన్స్‌కు, అతీంద్రియ శక్తులకు మధ్య జరిగే క్లాష్ ఆసక్తికరంగా మలచబడగా.. బ్లూ అండ్ డార్క్ థీమ్, పాడుబడిన బంగ్లా, నేల మీద వేసి ఉన్న యంత్రాలు, క్షుద్ర పూజల సెటప్ సినిమాలోని మూడ్‌ను ఎలివేట్ చేశాయి. కెమెరామెన్ సంతోష్ లైటింగ్ వాడిన విధానం, దానికి ఆర్ఆర్ ధృవన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తోడై కొన్ని చోట్ల ఉలిక్కిపడేలా చేశాయి.






