- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Director Shanker : తమిళ డైరెక్టర్ శంకర్‌కు ఈడీ షాక్
by Muthe.Rajitha |
ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్(Tamil Director Shankar)కు ఈడీ(ED) షాక్ ఇచ్చింది.

X
దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్(Tamil Director Shankar)కు ఈడీ(ED) షాక్ ఇచ్చింది. మనీ లాండరింగ్ కింద శంకర్ కు చెందిన రూ.10 కోట్ల 11 లక్షల ఆస్తులను అటాచ్ చేసింది. ఆరూర్ తమిళనాథన్(Arur Tamilanathan) అనే రచయిత.. తన 'జిగుబా'(Jiguba) పుస్తకంలోని కథను కాపీ కొట్టారని 2011లో ఎగ్మోర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన పుస్తకంలోని కథతోనే 'రోబో'(ROBO) సినిమా తీశారని తమిళనాథన్ తన పిటిషన్లో ఆరోపించారు. కాపీరైట్ యాక్ట్ 1957ను అతిక్రమించారని, దీనిపై చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. దీనిపై విచారణ జరిపిన ఎగ్మోర్ కోర్ట్.. ఆ సినిమా ద్వారా రూ.11.5 కోట్లు సంపాదించారని గుర్తించింది. ఈ కేసు ఆధారంగా ఈడీ శంకర్ కు చెందిన ఆస్తులను గురువారం అటాచ్ చేసింది. కాగా దీనిపై డైరెక్టర్ శంకర్ ఇప్పటి వరకు స్పందించలేదు.
Next Story






