- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దూకుడు సినిమా టైంలో నన్ను డైరెక్టర్ ఆ ఆపరేషన్ చేయించుకోమన్నారు.. వెన్నెల కిషోర్ షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్ కమెడియన్ వెన్నెల కిషోర్(Vennela Kishore) మనందరికీ సుపరిచితమే.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ కమెడియన్ వెన్నెల కిషోర్(Vennela Kishore) మనందరికీ సుపరిచితమే. కెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్యభరితమైన పాత్రలతో, తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. ఇటీవల కాలంలో ఏ సినిమా చూసినా కిశోరే కనిపిస్తున్నారు. ప్రస్తుతం చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. అయితే తాాజాగా ఆయన నటించిన 'సింగిల్'(Single) చిత్రం విజయవంతంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో విలేకరులతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఆయన మాట్లాడుతూ.. ‘దూకుడు సినిమా టైంలో శ్రీను వైట్ల(Sreenu Vaitla) గారు నన్ను లైపో ఆపరేషన్ చేయించుకో నేను మనీ ఇస్తాను అని అన్నారు.
ఎందుకంటే మహేబ్ బాబు(Mahesh Babu) పక్కన ఉండే రూల్‌లో అందరూ సన్నగా కనిపిస్తారు. నువ్వు లావు ఉంటే బాగోదు అని అన్నారు. అప్పుడు నేను తగ్గుతా అని చెప్పాను, కానీ తర్వాత తగ్గలేదు. బట్ సర్ ఫస్ట్ షెడ్యూల్ అయ్యాక ఇలానే బాగుంది అన్నారు’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం వెన్నెల కిషోర్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సమంత(Samantha) హీరోయిన్‌గా శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ‘దూకుడు’(Dukudu) సినిమాలో వెన్నెల కిశోర్ ‘శాస్త్రి’ అనే పాత్రలో ఆడియన్స్‌ను కడుపుబ్బా నవ్వించిన సంగతి తెలిసిందే.






