- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సినిమా ఆడిషన్స్‌లో ఆ పార్ట్‌కు సర్జరీ చేసుకోమన్నారు.. హీరోయిన్ నిత్య సంచలన కామెంట్స్
సాధారణంగా ఇండస్ట్రీలో రాణించాలంటే టాలెంట్‌తో పాటు అందం కూడా చాలా అవసరం.

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా ఇండస్ట్రీలో రాణించాలంటే టాలెంట్‌తో పాటు అందం కూడా చాలా అవసరం. మంచి గ్లామర్‌ను మైంటేన్ చేస్తూ స్క్రీన్ మీద చూడగానే ప్రేక్షకులు మెచ్చుకునేలా ఉండాలి. దీని కోసం హీరో హీరోయిన్స్ చాలా సర్జరీలు చేయించుకుంటారు. కానీ మనకు ఇష్టం లేకుండా ఆఫర్లు ఇచ్చే వారు ఆ సర్జరీ చేసుకోమని అంటే మాత్రం చాలా బాధగా ఉంటుంది అని అంటోంది ఈ బ్యూటీ. మరి ఇంతకీ ఆమె ఎవరు ఆమె స్టోరీ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం..
దేవుళ్ళు సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా బాగా ఫేమ్ తెచ్చుకున్న నిత్యా శెట్టి(Nithya Shetty) మనందరికీ సుపరిచితమే. ప్రస్తుతం ఈముద్దుగుమ్మ హీరోయిన్‌గా, కీలక పాత్రల్లో నటిస్తుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ భామ సినిమా ఆడిషన్స్‌లో తనకు ఎదురైన అనుభవాలు తెలిపింది. నిత్యాశెట్టి మాట్లాడుతూ.. ‘చైల్డ్ ఆర్టిస్ట్ కదా నేను ఇప్పుడు సినిమాల్లోకి వస్తే హీరోయిన్‌గా పిలిచి చాన్సులు ఇస్తారు అనుకున్నా. కానీ రియాలిటీ వేరు. నేను చేసే ఇన్ఫోసిస్ జాబ్ మానేసి సినిమాల్లోకి వచ్చా. చాలా ఆడిషన్స్ ఇచ్చా. ఓ ఆడిషన్‌లో నా ముక్కు చిన్నగా ఉందని రిజెక్ట్ చేశారు.
ముక్కు సర్జరీ చేసుకుని వస్తే చాన్స్ ఇస్తామన్నారు. ఇంకోసారి దేవుళ్ళు పాప కదా హీరోయిన్‌గా సెట్ అవ్వదు అని అన్నారు. ఇంకోసారి నేను కాస్త నల్లగా ఉన్నాను, ఫెయిర్ లేను అని అన్నారు. హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చిన సినిమా ‘ఓ పిట్టకథ’కు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. డైరెక్టర్ నన్ను ఒకే చేసినా నిర్మాతలు లావుగా ఉన్నాను అని అన్నారు. నన్ను ఓకే చేసి షూటింగ్‌కి వెళ్లే సరికి ఛాలెంజ్‌గా తీసుకొని 20 రోజుల్లో ఆరు కిలోలు తగ్గి చూపించాను’ అని తనకు ఎదురైన అనుభవాలు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నిత్యా చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.






