Anaganaga: వచ్చేసిన ‘అనగనగా’ టీజర్.. చాలా సంతోషంగా ఉందంటూ దుల్కర్ సల్మాన్ పోస్ట్

by Chukka Sudharani |

Anaganaga: వచ్చేసిన ‘అనగనగా’ టీజర్.. చాలా సంతోషంగా ఉందంటూ దుల్కర్ సల్మాన్ పోస్ట్
X

దిశ, సినిమా: సుమంత్ (Sumanth), కాజల్ చౌదరి (Kajal Chaudhary) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అనగనగా’ (Anaganaga). సన్నీ కుమార్ (Sunny Kumar) దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోగా.. తెలుగు సంవత్సరాది కానుకగా ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధం అవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేస్తూ.. ‘కొన్ని కథలు చెప్పలేము.. కేవలం అనుభూతి చెందుతాయి.. అనగనగా టీజర్‌ని లాంచ్ చేయడం ఎంతో సంతోషంగా ఉంది. మన ప్రియమైన గురువు శ్రీ వ్యాస్ యొక్క అద్భుతమైన కథను అండ్ అతని స్ఫూర్తిదాయకమైన ప్రయాణాన్ని అందంగా చిత్రీకరించిన అసలైన చిత్రం ‘అనగనగా’. ఈ అందమైన ప్రయాణంలో సుమంత్ అన్న అండ్ టీమ్ మొత్తం అఖండ విజయం సాధించాలని కోరుకుంటున్నాను!’ అంటూ ట్వీట్ చేశారు.

ఇక టీజర్ (teaser) విషయాని వస్తే.. నేటి విద్యా వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపుతూనే.. పిల్లలకు ఏ విధంగా పాఠాలు చెప్తే వారు అర్థం చేసుకుంటారో చెప్పే ప్రయత్నంగా ఈ చిత్రం తెరకెక్కినట్లు అర్థం అవుతోంది. అంతే కాకుండా.. ‘నోటితో విసిరేసి.. చేతులతో ఏరుకునేది ఏంటీ’ అని హీరో వేసిన పొడుపు కథ అందరిలో ఆసక్తిని రేకెత్తించింది. ప్రజెంట్ ఈ టీజర్ సోషల్ మీడియాలో విశేషంగా వైరల్ అవుతోంది.

Next Story