- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kaantha Trailer: భాగ్య శ్రీని ఫస్ట్ పట్టింది మేమే..రానా దగ్గుబాటి సంచలనం !
దుల్కర్ సల్మాన్ ( Dulquer Salmaan) హీరోగా భాగ్యశ్రీ ( Bhagyashri Borse) హీరోయిన్ గా నటించిన సినిమా కాంత

దిశ, వెబ్ డెస్క్: దుల్కర్ సల్మాన్ ( Dulquer Salmaan) హీరోగా భాగ్యశ్రీ ( Bhagyashri Borse) హీరోయిన్ గా నటించిన సినిమా కాంత. ఈ సినిమాలో సముద్రగని, రానా కూడా ప్రత్యేక పాత్రలో కనిపిస్తున్నారు. సెల్వమణి సెల్వరాజ్ దర్శకుడుగా పనిచేస్తుండగా రానా దగ్గుబాటి, ప్రశాంత్ పొట్లూరి నిర్మాతలుగా ఉన్నారు. నవంబర్ 14వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో.. తాజాగా ట్రైలర్ లాంచ్ చేశారు. ఇందులో దుల్కర్ సల్మాన్ చెప్పే డైలాగ్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
అయితే ఈ ట్రైలర్ ఈవెంట్ సందర్భంగా రానా దగ్గుబాటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హీరోయిన్ భాగ్యశ్రీని టాలీవుడ్ ఇండస్ట్రీకి తీసుకువచ్చింది తామేనని రానా వెల్లడించారు. మొదట ఆమె టాలెంట్ గుర్తించి ఇండస్ట్రీకి తీసుకువచ్చినట్లు స్పష్టం చేశారు. అయితే తమ సినిమా షూటింగ్ కాస్త లేట్ కావడంతో... తెలుగులో చాలా సినిమాలే ఆమె ఫినిష్ చేసిందని పేర్కొన్నారు. దీంతో అక్కడే ఉన్న హీరోయిన్ భాగ్యశ్రీ పగలబడి నవ్వారు. కాగా 2023లో బాలీవుడ్ ఇండస్ట్రీలో రెండు సినిమాలు చేసిన ఈ బ్యూటీ...తెలుగులో మిస్టర్ బచ్చన్, కింగ్‌డమ్ చేశారు.






