Dude: మ్యూజిక్ ప్రమోషన్స్ స్టార్ట్.. ఫస్ట్ గేర్ బూమ్‌బూమ్ అంటూ పోస్ట్

by Chukka Sudharani |   (  Updated:2025-08-22 15:59:12  IST  )

యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) ప్రజెంట్ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులు అనౌన్స్ చేస్తూ ఫుల్ స్వింగ్‌లో దూసుకుపోతున్నాడు.

Dude: మ్యూజిక్ ప్రమోషన్స్ స్టార్ట్.. ఫస్ట్ గేర్ బూమ్‌బూమ్ అంటూ పోస్ట్
X

దిశ, సినిమా: యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) ప్రజెంట్ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులు అనౌన్స్ చేస్తూ ఫుల్ స్వింగ్‌లో దూసుకుపోతున్నాడు. ఆయన నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘డ్యూడ్’ (Dude) ఒకటి. కీర్తి శ్వరన్ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు.

మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తుండగా.. హృదు హరూన్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఇప్పటికే ఈ చిత్రాన్ని దీపావళి స్పెషల్‌గా రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించిన మూవీ టీమ్.. తాజాగా మరో అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా మ్యూజిక్ ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తున్నట్లు తెలుపుతూ.. ‘పెప్పీ మ్యూజిక్ & బ్లాస్టింగ్ విజువల్స్‌తో డ్యూడ్ రాకను స్టైల్‌గా సెలబ్రేట్ చేసుకుందాం. డ్యూడ్ నుంచి ఫస్ట్ గేర్ ఊరం బ్లడ్ (తమిళం), బూమ్‌బూమ్ (తెలుగు) ఆగస్టు 28న విడుదల కాబోతుంది’ అంటూ ప్రకటించారు. కాగా.. ఈ సినిమాకు సాయిఅభ్యాంకర్ సంగీతం అందిస్తున్నాడు.

Next Story