ఒంట్లో వణుకు పుట్టిస్తున్న డ్రైవ్ ట్రైలర్

by Sujitha Rachapalli |

ఆది పినిశెట్టి హీరోగా నటిస్తున్న థ్రిల్లర్ మూవీ ‘డ్రైవ్’. మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై వి. ఆనంద్ ప్రసాద్ నిర్మించారు. జెనూస్ మొహమద్ దర్శకత్వం వహించిన సినిమాను ఈ నెల 12న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు.

ఒంట్లో వణుకు పుట్టిస్తున్న డ్రైవ్ ట్రైలర్
X

దిశ, సినిమా : ఆది పినిశెట్టి హీరోగా నటిస్తున్న థ్రిల్లర్ మూవీ ‘డ్రైవ్’. మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై వి. ఆనంద్ ప్రసాద్ నిర్మించారు. జెనూస్ మొహమద్ దర్శకత్వం వహించిన సినిమాను ఈ నెల 12న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలో ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. ప్రజా మీడియా కార్పొరేషన్ సౌతిండియాలో పేరున్న మీడియా సంస్థ. ఈ సంస్థ అధిపతి జే, తన ఫియాన్సితో కలిసి లండన్‌లో స్థిరపడేందుకు సిద్ధమవుతుంటాడు. ఇంతలో అతని సంస్థ అకౌంట్స్‌ ఓ హ్యాకర్ హ్యాక్ చేస్తాడు. జే ప్రతి మూవ్మెంట్ గమనిస్తూ అతన్ని చంపేస్తానని బెదిరిస్తుంటాడు. ప్రజా మీడియా కార్పొరేషన్‌‌కు సంబంధించిన ప్రతి విషయాన్ని ఆన్‌లైన్‌లో పెడుతూ.. ఆ సంస్థ పరువు, గౌరవాన్ని రోడ్డున పడేస్తాడు. తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌‌తో ఆడుకుంటున్న ఆ హ్యాకర్ ఆట కట్టించేందుకు సిద్ధమవుతాడు జే. ఆ హ్యాకర్ ఎవరు? జే అతన్ని పట్టుకున్నాడా లేదా? అనేది ట్రైలర్‌లో ఆసక్తికరంగా చూపించారు. యాక్షన్, ఎమోషన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ‘డ్రైవ్’ మూవీ ట్రైలర్ ఆకట్టుకోగా.. మూవీ కచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని ఆశిస్తున్నారు మేకర్స్.

Next Story