- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'దృశ్యం 3'ని వెంకీ మామకే వదిలేయాల్సిందా?
రేపు విడుదల కానున్న ‘దృశ్యం 3’ చిత్రంపై తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో అంచనాలు కనిపించడం లేదు. దీంతో ఈ సినిమాను వెంకటేష్ తో రీమేక్ చేసి ఉంటే బాగుండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో వచ్చిన బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్స్‌లో ‘దృశ్యం’ ఒకటి. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం అక్కడ ఘన విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఈ మూవీని పలు భాషల్లో రీమేక్ చేశారు. తెలుగులో వెంకటేష్ హీరోగా నటించగా తెలుగు ప్రేక్షకులను కూడా ఈ సినిమా విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాకు కొనసాగింపుగా మలయాళంలో ‘దృశ్యం 2’ తెరకెక్కగా, అందులోనూ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో కనిపించాడు. దీని తెలుగు రీమేక్‌లో వెంకటేష్ నటించగా ఈ మూవీ నేరుగా ఓటీటీలో విడుదలైంది. థియేటర్లలో విడుదల కాకపోయినా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కించుకుంది.
తాజాగా మోహన్ లాల్ ప్రధాన పాత్రలో ‘దృశ్యం 3’ తెరకెక్కింది. ఈ మూవీని మే 21వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో పలు భాషల్లో డబ్ చేసి విడుదల చేయనున్నారు. ఇప్పటికే తొలి రెండు భాగాలు తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నప్పటికీ మూడో భాగం విడుదలకు ముందు తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో హైప్ కనిపించడం లేదు. బుకింగ్స్ కూడా పెద్దగా నమోదు కావడం లేదనే టాక్ వినిపిస్తోంది. దీంతో చాలామంది ప్రేక్షకులు ‘దృశ్యం 3’ను తెలుగులో వెంకటేష్‌తో రీమేక్ చేసి విడుదల చేసి ఉంటే మరింత బెటర్ రెస్పాన్స్ వచ్చేదేమో అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే సినిమా విడుదల తర్వాత మంచి టాక్ వస్తే, బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఎలాంటి ప్రదర్శన చేస్తుందో అన్నది ట్రేడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.






