Drishyam 3: పోస్ట్‌పోన్‌కు అసలు కారణం ఇదే.. ఈ లెక్కన ఇప్పట్లో కష్టమే

by Pulgam srinivas |

గల్ఫ్ దేశాల్లో ప్రస్తుతం పరిస్థితులు బాగోలేకపోవడం వల్ల 'దృశ్యం 3' సినిమా వాయిదా పడినట్లు తెలుస్తోంది.

Drishyam 3: పోస్ట్‌పోన్‌కు అసలు కారణం ఇదే.. ఈ లెక్కన ఇప్పట్లో కష్టమే
X

దిశ, వెబ్ డెస్క్: మోహన్ లాల్ – మీనా జంటగా, జీతూ జోసఫ్ దర్శకత్వంలో 'దృశ్యం 3' తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ముందుగా ప్రకటించారు. అందుకు అనుగుణంగా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా పూర్తి చేస్తూ వచ్చారు. తాజాగా ఈ సినిమా విడుదలను సడన్‌గా వాయిదా వేస్తున్నట్లు అధికారిక ప్రకటన రావడంతో అభిమానులు షాక్ అయ్యారు. ఇప్పటికే విడుదల తేదీ ప్రకటించి, పనులు కూడా సజావుగా సాగుతున్న సమయంలో ఎందుకు ఈ మూవీని పోస్ట్‌పోన్ చేశారనే ప్రశ్నలు సినీ వర్గాల్లో చర్చకు దారితీశాయి.

ఈ సినిమా విడుదల వాయిదా పడటానికి ప్రధాన కారణం గల్ఫ్ దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం అని సమాచారం. ముఖ్యంగా మోహన్ లాల్ కు గల్ఫ్ దేశాల్లో మంచి మార్కెట్ ఉంది. ఆయన నటించిన చిత్రాలకు అక్కడి నుంచి భారీ స్థాయిలో కలెక్షన్లు వస్తుంటాయి. దాంతో ప్రస్తుతం గల్ఫ్ దేశాల్లో పరిస్థితులు అనుకూలంగా లేవు. ఈ సమయంలో సినిమాను విడుదల చేస్తే అక్కడ కలెక్షన్లు రావు అనే ఉద్దేశంతో ఈ మూవీ విడుదలను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. పరిస్థితులు పూర్తిగా సాధారణ స్థితికి వచ్చిన తరువాతే కొత్త విడుదల తేదీని ప్రకటించనున్నట్లు సినీ వర్గాల సమాచారం.

Next Story