- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దృశ్యం-3 రిలీజ్ డేట్ ఫిక్స్.. థియేటర్లలో వచ్చేది అప్పుడే(పోస్ట్)
మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటించిన 'దృశ్యం' (Drishyam) సిరీస్ సినిమాలకు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది.

దిశ, వెబ్‌డెస్క్: మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటించిన 'దృశ్యం' (Drishyam) సిరీస్ సినిమాలకు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఇప్పటి వరకు రెండు పార్ట్స్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో మూడో భాగాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. మలయాళంలో తెరకెక్కించిన ఈ చిత్రాలను తెలుగు హిందీలోనూ డబ్ చేసి రిలీజ్ చేయగా సూపర్ హిట్‌గా నిలిచాయి.
ఇక తెలుగులో విక్టరీ వెంకటేష్, హిందీలో అజయ్ దేవగన్ నటించారు. అయితే తాజాగా జీతూ జోసెఫ్ డైరెక్షన్లో వస్తున్న దృశ్యం-3 రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. ఓ వీడియోను షేర్ చేస్తూ.. ‘ఈ మూవీ ఏప్రిల్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది’ అని ట్వీట్ చేశారు. కాగా మోహన్ లాల్‌తో పాటు ఈ సినిమాలో మీనా, అన్సిబా హస్సన్, ఈస్తర్ అనిల్, ఆశా శరత్, మురళీ గోపి, సిద్ధిక్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని ఆశీర్వాద్ సినిమాస్ పతాకంపై ఆంటోనీ పెరంబవూర్ నిర్మించారు.






