Drishyam 3: దృశ్యం 3 రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆనందంలో అభిమానులు

by Chukka Sudharani |

మ‌ల‌యాళ సూపర్ హిట్ చిత్రం ‘దృశ్యం’ ఫ్రాంచైజీలో ఇప్పుడు మూడో భాగం రాబోతున్నది.

Drishyam 3: దృశ్యం 3 రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆనందంలో అభిమానులు
X

దిశ, సినిమా: మ‌ల‌యాళ సూపర్ హిట్ చిత్రం ‘దృశ్యం’ ఫ్రాంచైజీలో ఇప్పుడు మూడో భాగం రాబోతున్నది. ఇప్పటికే దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇవ్వగా.. ప్రేక్షకులల్లో భారీ హైప్ క్రియేట్ అయింది. ఇక దృశ్యం ఫ్రాంచైజీకు ఉన్న క్రేజ్‌తో తెలుగు, హిందీ భాష‌ల్లో రీమేక్ చేశారు. ఆ రెండు భాగాలు సూపర్‌హిట్‌ కాగా.. ఇప్పుడు ఆడియన్స్ దృష్టి మొత్తం దృశ్యం 3 పై పడింది. మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ దీనికి దర్శకత్వం వహిస్తుండగా.. మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. అలాగే అక్టోబర్‌లో సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుందని చిత్ర యూనిట్ తెలిపింది.

అలాగే హిందీ వెర్షన్‌లో కూడా దృశ్యం 3 సినిమా రూపొందుతుంద‌ని అజ‌య్ దేవ‌గ‌ణ్ ప్రక‌టించ‌డంతో అంద‌రిలో అనేక అనుమానాలు క‌లిగాయి. మలయాళం, హిందీలో వేర్వేరు కథలతో దృశ్యం 3 వస్తుందని అంతా భావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా రిలీజ్‌పై నెట్టింట ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్ అవుతుంది. ఈ మేరకు.. ‘దృశ్యం3 - 2026 మార్చి విడుదల లాక్ చేయబడింది.. ఆశీర్వాద్ సినిమాలు ఈ చిత్రానికి అత్యంత వ్యూహాత్మక విడుదల తేదీతో భారీ విడుదలను అందిస్తుంది’ అంటూ ఓ పోస్ట్ నెట్టింట దర్శనమిచ్చింది. దీంతో ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా కోసం వెయిట్ చేస్తున్న అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. లింక్


Next Story