3 రోజుల్లోనే భారీ కలెక్షన్స్ రాబట్టిన ‘దృశ్యం-3’.. మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మోహన్‌లాల్!

by Mallepaka Hamsa |

మూడే రోజుల్లో రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరి సరికొత్త రికార్డ్ సృష్టించింది. మిక్డ్స్ టాక్ వచ్చినప్పటికీ జార్జ్‌కుట్టి పాత్రపై ఉన్న క్రేజ్ కారణంగా తొలి వారంలోనే భారీ కలెక్షన్లు రాబడుతూ దూసుకుపోతోంది.

3 రోజుల్లోనే భారీ కలెక్షన్స్ రాబట్టిన ‘దృశ్యం-3’.. మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మోహన్‌లాల్!
X

దిశ, సినిమా: మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఇప్పటికీ వరుస సినిమాల్లో నటిస్తూ కుర్ర హీరోలకు గట్టి పోటీనిస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ హిట్లు సాధిస్తున్న ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. జీనియస్ డైరెక్టర్ జోసెఫ్ దర్శకత్వంలో వచ్చిన సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ‘దృశ్యం-3’. ముందుగా వచ్చిన రెండు భాగాలు బ్లాక్ బస్టర్‌ హిట్ కాగా.. మూడో పార్ట్ కూడా ఊహించని విధంగా విడుదలైన రోజు నుంచి యావరేజ్ టాక్ దక్కించుకుంటున్నప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం భారీగా రాబడుతోంది. మూడే రోజుల్లో రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరి సరికొత్త రికార్డ్ సృష్టించింది. మిక్డ్స్ టాక్ వచ్చినప్పటికీ జార్జ్‌కుట్టి పాత్రపై ఉన్న క్రేజ్ కారణంగా తొలి వారంలోనే భారీ కలెక్షన్లు రాబడుతూ దూసుకుపోతోంది. ఈమేరకు మోహన్ లాల్ ట్విట్టర్ ద్వారా సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సినిమా మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది.

ఈ విషయాన్ని తెలుపుతూ.. ‘‘13 సంవత్సరాలుగా ఈ ప్రయాణంలో మాతో పాటు ఉన్నందుకు ధన్యవాదాలు. ఈ కథపై మీకున్న ప్రేమ మద్దతు, నమ్మకం మమ్మల్ని వినమ్రులను చేస్తూనే ఉన్నాయి’’ అని మోహన్‌లాల్ రాసుకొచ్చారు. కాగా.. ట్రేడ్ వర్గాల ప్రకారం.. ఇప్పటికి ‘దృశ్యం-3’ సినిమా మూడు రోజుల్లో రూ.117.17 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు బుక్‌పై షోలో మూడో రోజు ఏకంగా 362.05k టికెట్లు అమ్ముడైనట్లు మేకర్స్ వెల్లడించగా.. మే24న సండే కావడంతో కలెక్షన్లు మరింతగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దృశ్యం ఫ్రాంచైజీని తెలుగులోనూ రీమేక్ చేసిన విషయం తెలిసిందే. విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన మొదటి రెండు భాగాలను తెలుగులో తీశారు. కానీ ఇప్పుడు ‘దృశ్యం-3’ చిత్రాన్ని రీమేక్ చేయకుండా తెలుగులోకి డబ్బింగ్ చేయగా.. ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

Next Story