'దృశ్యం 3' తెలుగు ట్రైలర్‌ వచ్చేసింది

by velandi.Saikiran |

'దృశ్యం 3' తెలుగు ట్రైలర్‌ వచ్చేసింది

దృశ్యం 3 తెలుగు ట్రైలర్‌ వచ్చేసింది
X

దిశ‌, వెబ్ డెస్క్: మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ దృశ్యం 3 (Drishyam 3). ఇప్పటికే వచ్చిన దృశ్యం, దృశ్యం 2 రెండు సినిమాలు కూడా బంపర్ హిట్ కొట్టాయి. ఇక ఆ రెండు సినిమాలకు సీక్వెన్స్ గా ఇప్పుడు దృశ్యం 3 కూడా వస్తోంది. లేటెస్ట్ గా ఈ సినిమా తెలుగు ట్రైలర్ లాంచ్ చేశారు. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా, ఈ నెల 21వ తేదీన థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఇందులో భాగంగానే ప్రమోషన్స్ మొదలు పెట్టింది చిత్ర బృందం.

ఇటీవల మలయాళ ట్రైలర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం... నేడు తెలుగులో కూడా విడుదల చేసింది. ఈ ఫ్రాంచైజీ లో వచ్చిన తొలి రెండు సినిమాలను విక్టరీ వెంకటేష్ తెలుగులో రీమేక్ చేశాడు. కానీ ఈ సారి పార్ట్ 3 మాత్రం రీమేక్ చేయకపోవడంతో ఒరిజినల్ వెర్షన్ నే తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. కాగా ఈ సినిమా రన్ టైం 2.39 గంటలుగా ఉంది. ఇక‌ ఈ సినిమాను మలయాళం, తెలుగుతో పాటు తమిళం, కన్నడ భాషల్లో ఈ నెల 21వ తేదీన రిలీజ్ చేస్తున్నారు.



Next Story