Drishyam 3: 'దృశ్యం 3' కొత్త విడుదల తేదీ వచ్చేసింది

by Pulgam srinivas |

Drishyam 3: మే 21న 'దృశ్యం 3'ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

Drishyam 3: దృశ్యం 3 కొత్త విడుదల తేదీ వచ్చేసింది
X

దిశ, వెబ్ డెస్క్: మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘దృశ్యం 3’ చిత్రాన్ని మొదట ఏప్రిల్ 2న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగా చిత్రానికి సంబంధించిన పనులను వేగంగా పూర్తి చేస్తూ వచ్చారు. అయితే సడన్‌గా ఈ సినిమాను ఏప్రిల్ 2న విడుదల చేయడం లేదని, కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామని చిత్ర బృందం తెలిపింది. ఈ నేపథ్యంలో విడుదల వాయిదాపై అనేక వార్తలు వినిపించాయి. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో మోహన్‌లాల్ కు ఉన్న భారీ అభిమానాన్ని దృష్టిలో పెట్టుకుని, ప్రస్తుతం అక్కడ నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా కలెక్షన్లపై ప్రభావం పడే అవకాశం ఉందనే ఉద్దేశంతో విడుదలను వాయిదా వేసినట్లు ప్రచారం జరిగింది.

ఇక తాజాగా చిత్ర బృందం ఈ సినిమాకు సంబంధించిన కొత్త విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. ‘దృశ్యం 3’ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా మే 21న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. మీనా ఈ చిత్రంలో మోహన్‌లాల్ కు జంటగా నటించనుండగా, ప్రముఖ దర్శకుడు జీతూ జోసెఫ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ‘దృశ్యం’, ‘దృశ్యం 2’ చిత్రాలు భారీ విజయాలను సాధించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాయి. దీంతో ఈ ఫ్రాంచైజ్ నుంచి వస్తున్న మూడవ భాగం ‘దృశ్యం 3’ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.




Next Story