- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
DQ41: ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. పూజాకార్యక్రమాలతో స్టార్ హీరో సినిమా స్టార్ట్
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్.. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు.

దిశ, సినిమా: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్.. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. సీతా రామం, లక్కీ భాస్కర్ వంటి సినిమాలతో తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకున్న ఈయన ప్రస్తుతం ‘కాంత’ సినిమాతో బిజీగా ఉన్నాడు. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో భాగ్యశ్రీ హీరోయిన్‌గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం కాంత సినిమాతో బిజీగా ఉన్నా దుల్కర్.. తాజాగా తన నెక్ట్స్ ప్రాజెక్టును అనౌన్స్ చేశాడు. ఫ్యాన్స్ అందరూ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్న DQ41 నేడు ఘనంగా పూజా కార్య క్రమాలతో స్టార్ట్ అయింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా డైరెక్టర్స్ ఓదెల శ్రీకాంత్, బుచ్చిబాబు సనా, హీరో నేచులర్ స్టార్ నాని హాజరయ్యారు. ఫస్ట్ ముహూర్తనికి నాని క్లాప్ కొట్టాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు టీమ్. కాగా.. ప్రేమకథ చిత్రంగా తెరకెక్కుతోన్న DQ41 కు రవి నెలకుదిటి దర్శకత్వం వహిస్తుండగా.. SLV సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. దీనికి జీవి ప్రకాశ్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. Link






