- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Pawan Kalyan: పవన్ కల్యాణ్‌ను అరెస్ట్ చేస్తారనే డౌట్ వచ్చిదంతే.. ఆ రాత్రి ఏం జరిగిందో తెలుసా? (వీడియో)
దిశ, సినిమా: గత కొద్ది రోజుల నుంచి సినిమా ఇండస్ట్రీలోని సెలబ్రిటీలు పలు కేసుల్లో అరెస్ట్ అవుతున్న సంగతి తెలిసిందే. కానీ ఎక్కువ రోజులు జైలులో ఉండకుండా బెయిల్‌పై వచ్చేస్తున్నారు. అసలు వారు తప్పు చేశారా లేదా అనేది తెలియకుండానే అంతా జరిగిపోతుంది. కానీ కొందరు మాత్రం ఈ ఘటనలపై యుద్ధం చేస్తున్నారు. అయితే ఇటీవల పుష్ప-2(Pushpa 2: The Rule) ప్రీమియర్ షో వేసినప్పుడు తొక్కిసలాట జరగ్గా అందులో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఈ కేసులో అల్లు అర్జున్(Allu Arjun)ను అరెస్ట్ చేసి జైలులో వేశారు. రిమాండ్‌కు తరలించగా... చివరి నిమిషంలో కోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది. దీంతో శనివారం బయటకు వచ్చేశారు.
ఇదిలా ఉంటే.. తాజాగా, పవన్ కల్యాణ్(Pawan Kalyan)కు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. సంధ్య థియేటర్‌లో(Sandhya Cinema Hall 35mm) వద్ద జరిగిన సంఘటన మాదిరిగా ఉన్న వీడియో మరోసారి నెట్టింట షేర్ చేస్తున్నారు నెటిజన్లు. ఒకరోజు రాత్రి వర్షంలో పవన్ కల్యాణ్ అభిమానులతో ముచ్చటించగా.. అక్కడికి ఎంతో మంది వచ్చారు. ఇక ఈ వీడియోను షేర్ చేస్తూ ఓ నెటిజన్ ‘‘ఫుల్ వర్షంలో, మధ్యరాత్రి పవన్ కల్యాణ్‌ను కూడా అరెస్ట్ చేస్తారేమో అని డౌట్ వచ్చింది. మొత్తం విత్ ఇన్ సెకండ్స్‌లో ఫ్యాన్స్ ఆయనను చుట్టుముట్టారు. ఈ క్రమంలో.. ఏదైనా జరగకూడనిది జరిగి ఆయనను పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్తారు కావొచ్చు? అనిపించింది’’ అని రాసుకొచ్చాడు.