‘డెకాయిట్’ మూవీ నుంచి డబుల్ అప్డేట్స్..మధురం కాదు అవును అదొక నరకం అంటూ మృణాల్ షాకింగ్ పోస్ట్

by Mallepaka Hamsa |

యంగ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) సీరియల్స్ ద్వారా వచ్చి విపరీతమైన పాపులారిటీ దక్కించుకుంది.

‘డెకాయిట్’ మూవీ నుంచి డబుల్ అప్డేట్స్..మధురం కాదు అవును అదొక నరకం అంటూ మృణాల్ షాకింగ్ పోస్ట్
X

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) సీరియల్స్ ద్వారా వచ్చి విపరీతమైన పాపులారిటీ దక్కించుకుంది. ఇక ‘సితారామం’ చిత్రంతో ఘన విజయం సాధించిన ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. అమ్మడు తన అందం, అభినయంతో ఒక్క సినిమాతోనే ఊహించని విధంగా అభిమానులను సొంతం చేసుకుంది. ఇక ఆ తర్వాత మృణాల్ వరుస చిత్రాల్లో నటించినప్పటికీ నానితో చేసిన ‘హాయ్ నాన్న’(hai nanna) బ్లాక్ బస్టర్ హిట్ అయింది. చివరగా ఈ భామ ‘కల్కి’ (kalki)సినిమాలో నటించింది. ఈ పాన్ ఇండియా మూవీ కూడా ఘన విజయం సాధించింది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం మృణాల్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘డెకాయిట్’(Dacoit). అడివి శేష్(Adivi Sesh) హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని షానీల్ డియో తెరకెక్కిస్తున్నారు. ఇక ఇందులో అనురాగ్ కశ్యప్(Anurag Kashyap), ప్రకాష్ రాజ్, జైన్ మరియే ఖాన్, సునీల్, అతుల్ కులకర్ణి, కామాక్షి భాస్కర్ల కీలక పాత్రలో కనిపించనున్నారు.

అయితే ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ తెలుగు, హిందీ భాషల్లో నిర్మిస్తోంది. ఇద్దరు మాజీ ప్రేమికుల కథగా రాబోతున్న ఈ చిత్రంలో మృణాల్, అడివి శేష్ తమ జీవితాలను మార్చడానికి వరుస దోపిడీలకు ప్లాన్ చేస్తారు. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన డబుల్ అప్డేట్స్‌ను మృణాల్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. ఈ మిస్టరీ థ్రిల్లర్ మూవీ డిసెంబర్ 25న రాబోతున్నట్లు తెలుపుతూ ‘డెకాయిట్’ గ్లింప్స్ షేర్ చేసింది. ఈ పోస్ట్‌కు ‘‘మధురం కాదు అవును అదొక నరకం’’ అనే క్యాప్షన్ పెట్టింది. ఇక ఇందులో..మృణాల్ బోరున ఏడుస్తూ వెళ్తుండగా.. అడివి శేష్ నోట్లో కీ పెట్టుకుని నవ్వుతూ కనిపించాడు. ఇందులో ‘‘జూలియట్ నిన్ను అందరూ మోసం చేశారు నేను అందుకు రాలేదు’’ అని చెప్పే అడివి శేష్ డైలాగ్స్ క్యూరియాసిటీని పెంచుతున్నాయి.

Next Story