ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా.. వర‌ల్డ్ ఆఫ్ కాంతార గ్లింప్స్‌ విడుదల.. రిలీజ్ డేట్ క‌న్‌ఫాం..

by Gugulothu.Kavitha |

కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో రాబోతున్న లేటెస్ట్ సినిమా ‘కాంతార: చాప్టర్ 1’.

ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా.. వర‌ల్డ్ ఆఫ్ కాంతార గ్లింప్స్‌ విడుదల.. రిలీజ్ డేట్ క‌న్‌ఫాం..
X

దిశ, వెబ్‌డెస్క్: కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో రాబోతున్న లేటెస్ట్ సినిమా ‘కాంతార: చాప్టర్ 1’. కన్నడలో తెరకెక్కిన ‘కాంతార’ మూవీకి ప్రీక్వెల్‌లో ఈ చిత్రం తెరకెక్కుతుండంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ సినిమా నుంచి ఇటీవ‌ల రిషబ్ శెట్టి పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఓ పవర్‌ఫుల్ పోస్టర్ రిలీజ్ చేయ‌గా, దీనికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. కాగా ఈ చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తుండగా హొంబాలే ఫిలింస్ భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.

ఈ క్రమంలో తాజాగా ఈ మూవీకి సంబంధించిన గ్లింప్స్‌తో పాటు రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేశారు మూవీటీమ్. ఇందులో భాగంగా ఈ చిత్రాన్ని గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. అయితే మూడేళ్ల నుండి షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ షూటింగ్ ఎట్ట‌కేల‌కి పూర్తైంది. ఈ సంద‌ర్భంగా వ‌ర‌ల్డ్ ఆఫ్ కాంతార పేరిట మేకింగ్ వీడియో విడుద‌ల చేశారు. కాతార చాప్ట‌ర్ 1 మూవీ ఎలా ఉండ‌నుంది? సెట్స్ ఎలా ఉంటాయి అనేది వీడియోలో చూపించారు.

తొలి భాగంతో పోలిస్తే ఈ సారి సెట్స్ చాలా గ్రాండియ‌ర్‌గా ఉంటాయ‌ని వీడియో ద్వారా అర్ధ‌మ‌వుతుంది. నా ఊరు, అక్క‌డి సంప్ర‌దాయాల‌ని చూపించాల‌నే ఉద్దేశంతోనే ఈ సినిమా తీసాన‌ని, ఇందుకోసం మూడేళ్ల‌పాటు కృషి చేశాం. దాదాపు 250 రోజుల పాటు షూటింగ్ జ‌రిపామ‌ని రిషబ్ శెట్టి అన్నారు. ఇక చిత్ర షూటింగ్ పూర్తి కావ‌డంతో, ఈ మూవీ అక్టోబ‌ర్ 2న వచ్చేందుకు సిద్ధ‌మైంది. తాజాగా విడుదలైన వీడియో నెటిజన్స్‌ని ఎంతగానో ఆకట్టుకోవడంతో పాటు సినిమాపై మరింత హైప్ పెంచేసింది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా గ్లింప్స్ పై ఓ లుక్ వేసేయండి. Link

Next Story