- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా.. మహేష్ బర్త్‌డేకు రెండు బ్లాక్‌బస్టర్స్ రీ-రిలీజ్
మహేష్ బాబు నటించిన ‘పోకిరి’, ‘దూకుడు’ చిత్రాలను ఆగస్టు నెలలో రీ-రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

దిశ, వెబ్ డెస్క్: ఆగస్టు నెల వచ్చిందంటే చాలు సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఆయన పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తుంటారు. ఈ ఏడాది కూడా మహేష్ బాబు బర్త్‌డేను ప్రత్యేకంగా సెలబ్రేట్ చేయాలని అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో వారికి అదిరిపోయే గుడ్ న్యూస్ బయటకు వచ్చింది. మహేష్ బాబు నటించిన రెండు బ్లాక్‌బస్టర్ చిత్రాలను ఆయన పుట్టినరోజు సందర్భంగా రీ-రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు నెలలో ప్రపంచవ్యాప్తంగా ‘పోకిరి’ చిత్రాన్ని రీ-రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.
2006లో విడుదలైన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచి భారీ సంచలనం సృష్టించింది. అలాగే మహేష్ నటించిన మరో బ్లాక్‌బస్టర్ మూవీ ‘దూకుడు’ను ఆగస్టు 7వ తేదీన రీ-రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. 2011లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో ఎన్నో కొత్త రికార్డులను సృష్టించింది. ఇలా మహేష్ కెరీర్‌లో ప్రత్యేక స్థానం సంపాదించిన ఈ రెండు సూపర్ హిట్ చిత్రాలు మరోసారి థియేటర్లలో సందడి చేయనున్నాయి. రీ-రిలీజ్ సందర్భంగా ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సునామీ సృష్టిస్తాయనే అంశం ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.






