- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వేరొకరి జీవితాన్ని గడుపుతూ మీ సమయాన్ని వృధా చేసుకోకండి.. చర్చనీయాంశంగా మారిన హీరోయిన్ పోస్ట్
తెలుగు హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ (Aishwarya Rajesh) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ (Aishwarya Rajesh) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఈ భామ టాలీవుడ్ కంటే కోలీవుడ్ ఇండస్ట్రీలోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అక్కడ ఈ ముద్దుగుమ్మ లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కూడా చేసి మంచి ఫేమ్ తెచ్చుకుంది. ఇక తెలుగులో ‘కౌసల్య కృష్ణమూర్తి’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఇక్కడ కూడా పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇక ఈ ఏడాది నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయి.. ఏకంగా రూ. 300 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. దీంతో ఈ భామకు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రజెంట్ ఈ చిన్నది చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా ఉన్నది.
ఇదిలా ఉంటే.. ఐశ్వర్య రాజేష్ సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టీవ్‌గా ఉంటుంది. నిత్యం లేటెస్ట్, ట్రెండీ వేర్ డ్రెస్సులతో కుర్రకారు మనసులను గెలిచేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా ఐశ్వర్య తన ఇన్‌స్టాలో బ్లూ కలర్ అవుట్ ఫిట్ ఉన్న వీడియోను షేర్ చేస్తూ.. ‘మీ సమయం పరిమితం, కాబట్టి వేరొకరి జీవితాన్ని గడుపుతూ దాన్ని వృధా చేయకండి’ అని రాసుకొచ్చింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు ఇప్పుడు ఎందుకు పెట్టింది ఈ క్యాప్షన్ అని, సూపర్ అని, పెళ్లెప్పుడు చేసుకుంటావ్ అని, బ్లూ ఇన్ బ్యూటీ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ చిన్నదాని పోస్ట్ పై మీరు ఓ లుక్ వేసేయండి.






