- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనవసరంగా ఇరుక్కోవాలని లేదు.. హీరోలపై అలాంటి కామెంట్స్ చేసిన దిల్ రాజు
‘గాయపడ్డ సింహం’ ఈవెంట్‌లో “ఏ హీరో సినిమాల వల్ల మీకు ఎక్కువ నష్టాలు వచ్చాయి?” అనే ప్రశ్న దిల్ రాజుకు ఎదురైంది. ఆయన ఎవరి పేరూ చెప్పకుండా, స్మూత్‌గా ఎస్కేప్ అయ్యారు.

దిశ, వెబ్ డెస్క్: తరుణ్ భాస్కర్ తాజాగా ‘గాయపడ్డ సింహం’ అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాను మే 1వ తేదీన విడుదల చేయనున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో నిన్న సాయంత్రం చిత్ర బృందం ఒక ఈవెంట్‌ను నిర్వహించి సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యాంకర్ దిల్ రాజును “మీరు గాయపడ్డ సందర్భం ఏమిటి?” అని ప్రశ్నించగా, ఆయన స్పందిస్తూ “సినిమా ఫ్లాప్ అయినప్పుడు గాయపడతాం. ఎందుకంటే డబ్బులు పెట్టి సినిమా తీస్తాం కాబట్టి, హిట్ అయితే ఆనందం, ఫ్లాప్ అయితే బాధ మిగులుతుంది.
చాలా సినిమాల ద్వారా నేను గాయపడ్డాను” అని అన్నారు. తరువాత యాంకర్ “ఏ హీరో సినిమాతో ఎక్కువగా నష్టపోయారు?” అని ప్రశ్నించగా, దిల్ రాజు స్మూత్‌గా స్పందిస్తూ “నా మిత్రులు చాలామంది ఫ్రంట్ రోలో కూర్చొని రెడీగా ఉన్నారు. నేను ఏ హీరో పేరు చెప్పినా ఇరుక్కుంటాను. అందుకే అనవసరంగా ఎక్కడా ఇరుక్కోవడం ఇష్టం లేదు” అంటూ ప్రశ్నను తప్పించుకున్నారు. దిల్ రాజు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ‘గాయపడ్డ సింహం’ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమాతో తరుణ్ భాస్కర్‌కి ఏ స్థాయి విజయం దక్కుతుందో చూడాలి.






