స్క్రీన్ పై మాస్ మహారాజా వద్దు : రవితేజ షాకింగ్ నిర్ణయం

by Naga Rani Yarlagadda |

కిషోర్ తిరుమల డైరెక్షన్లో రవితేజ హీరోగా రూపొందుతోన్న భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా..

స్క్రీన్ పై మాస్ మహారాజా వద్దు : రవితేజ షాకింగ్ నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: కిషోర్ తిరుమల డైరెక్షన్లో రవితేజ హీరోగా రూపొందుతోన్న భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా టీజర్ ఇటీవలే విడుదలైంది. సంక్రాంతి బరిలో ఉన్న ఈ సినిమాపై అంచనాలు పెంచేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. ప్రమోషన్లలో భాగంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాస్ చిత్రాలతో తనకంటూ స్పెషల్ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న రవితేజకు మాస్ మహారాజా అనే ట్యాగ్ ఉన్న విషయం తెలిసిందే. భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలో తన పేరు ముందు మాస్ మహారాజా అనే ట్యాగ్ లేకుండా రవితేజ అనే పేరును మాత్రమే వాడాలని సూచించినట్లు డైరెక్టర్ తెలిపారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో తాను కూడా ఇందుకు ఓకే చెప్పినట్లు కిశోర్ తిరుమల చెప్పారు.

భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చుతుందని, ఇందులో రవితేజ తనదైన కామెడీ టైమింగ్ తో ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతున్నట్లు చెప్పారు. డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. భీమ్స్ సిసిరోలియా సంగీత బాణీలు సమకూర్చారు. సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Next Story