- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ విషయాన్ని నేషనల్ వార్తగా మార్చకండి.. సెలబ్రిటీలను అన్‌ఫాలో చేయడంపై కరణ్ జోహార్ షాకింగ్ పోస్ట్
నేను డిజిటల్ డెటాక్స్ చేస్తున్నాను. ఇన్‌స్టాగ్రామ్‌లో నా సమయాన్ని, శక్తిని వృథా చేసుకోకుండా తగ్గించుకోవడం కోసమే అందరినీ అన్‌ఫాలో చేశాను.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ సోషల్ మీడియాలో చేసిన పని ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షారుఖ్ ఖాన్, అనన్యా పాండే, కార్తీక్ ఆర్యన్, అలాగే తన ప్రాణస్నేహితుడు మనీష్ మల్హోత్రాతో సహా చాలా మంది స్టార్ సెలబ్రిటీలను ఒక్కసారిగా అన్‌ఫాలో చేయడం గమనార్హం. దీంతో వీరితొ పలు వివాదాలు ఏర్పిడినట్లు అందుకే ఆయన అన్‌ఫాలో చేసినట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. మరికొందరు మాత్రం రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఇక ఈ లిస్ట్‌లో కరణ్ జోహార్ ఎంతో ఇష్టపడే కరీనా కపూర్, మలైకా అరోరా.. అలాగే ఆయన చేతుల మీదుగా ఇండస్ట్రీకి పరిచయమైన ఆలియా భట్, వరుణ్ ధావన్, సిద్ధార్థ్ మల్హోత్రాల పేర్లు కూడా లేకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం కరణ్ జోహార్ ఇన్‌స్టాగ్రామ్‌లో కేవలం 78 మందిని మాత్రమే ఫాలో అవుతున్నారు.
ఈ అన్‌ఫాలో వ్యవహారంపై సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరుగుతోంది. ఈనేపథ్యంలో.. తాజాగా, ఈ విషయంపై, కరణ్ జోహార్ స్పందిస్తూ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్ పెట్టారు. . "నేను డిజిటల్ డెటాక్స్ చేస్తున్నాను. ఇన్‌స్టాగ్రామ్‌లో నా సమయాన్ని, శక్తిని వృథా చేసుకోకుండా తగ్గించుకోవడం కోసమే అందరినీ అన్‌ఫాలో చేశాను. అంతేకానీ దీని వెనుక ఎలాంటి గొడవలు లేవు" అని క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు, "దేవుడి కోసమే చెప్తున్నా.. దీనిని ఒక జాతీయ వార్తగా మార్చకండి. క్లిక్‌బైట్ కోసం వేరే ఏవైనా వార్తలు రాసుకోండి, ఇది చాలా చిన్న విషయం" అంటూ మీడియాపై కాస్త అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా.. అది చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. కరణ్ జోహార్ బ్యానర్‌పై ఆయుష్మాన్ ఖురానా నటించిన ‘ఉడ్తా తీర్’, కార్తీక్ ఆర్యన్ హీరోగా ‘నాగ్గిల్లా’ వంటి క్రేజీ సినిమాలు రాబోతున్నాయి.






