- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లైఫ్‌లో స్ట్రెస్ వద్దు.. అదొక్కటే చాలు.. స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’(Ichata Vahanamulu Niluparadhu) సినిమాతో తెలుగు ఆడియన్స్ కు పరిచయమైన స్టార్ బ్యూటీ మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) మనందరికీ సుపరిచితమే.

దిశ, వెబ్‌డెస్క్: ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’(Ichata Vahanamulu Niluparadhu) సినిమాతో తెలుగు ఆడియన్స్ కు పరిచయమైన స్టార్ బ్యూటీ మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) మనందరికీ సుపరిచితమే. ఆ తర్వాత ‘హిట్:ది సెకెండ్ కేస్’(Hit:The Second Case), ‘గుంటూరు కారం’(Gunturu Karam), ‘లక్కీ భాస్కర్’(Lucky Bhaskar), ‘గోట్:ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’(GOAT), ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunnam), ‘అనగనగా ఒక రాజు’(Anaganaga Oka Raju) వంటి సినిమాలతో ఈ భామ మంచి హిట్లను తన ఖాతాలో వేసుకుంది. అలా దాదాపు అన్ని సినిమాలు హిట్ కావడంతో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్‌ను దక్కించుకుంది. తాను నటించిన సినిమాలన్నీ మంచి సక్సెస్ అవుతున్న నేపథ్యంలో మీనాక్షి లక్కీ హీరోయిన్ అయిపోయింది.
రీసెంట్‌గా నటించిన 'అనగనగా ఒకరాజు' మూవీతో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. నవీన్ పొలిశెట్టి(Naveen Polishetty) హీరోగా నటించిన ఈ చిత్రానికి మారి(Mari) దర్శకత్వం వహించాడు. ఇక సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ(Suryadevara Naga Vamsi), సాయి సౌజన్య(Sai Sowjanya) నిర్మించారు. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ప్రజెంట్ ఈ ముద్దుగుమ్మ అక్కినేని హీరో నాగ చైతన్య(Naga Chaitanya) సరసన 'ఎన్‌సీ-24'(NC-24) మూవీతో పాటు యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) సరసన ఓ సినిమాలో యాక్ట్ చేస్తోంది.
అలా ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియా(Social Media)లో యాక్టివ్ గా ఉంటుంది మీనాక్షి. ఈ క్రమంలో ఈ భామకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వీడియోలో.. లైఫ్‌లో స్ట్రెట్ ఏమ్ వద్దు.. ఓన్లీ ఫుడ్ చాలు అని చాలా ఫుడ్ ఐటమ్స్ ముందు పెట్టుకుని తింటున్నది. బిర్యానీ తింటూ ఇదే నా మోటివేషనల్ వీడియో.. డెకెట్.. సెంచరీ అని చెబుతూ నవ్వేస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారగా.. నెటిజన్లు వివిధ రకరకాలుగా స్పందిస్తున్నారు.






