‘ఇతరులను నిందించకండి మిమ్మల్ని మీరు మెరుగుపరచుకోండి’: సీనియర్ హీరో

by Kodari Anjali |

సెంటిమెంట్ సీన్స్‌కు కేరాఫ్ అడ్రస్‌ సీనియర్ హీరో స్టార్ హీరో వెంకటేష్.

‘ఇతరులను నిందించకండి మిమ్మల్ని మీరు మెరుగుపరచుకోండి’: సీనియర్ హీరో
X

దిశ, వెబ్‌డెస్క్: సెంటిమెంట్ సీన్స్‌కు కేరాఫ్ అడ్రస్‌ సీనియర్ హీరో స్టార్ హీరో వెంకటేష్ (Venkatesh). అనేక చిత్రాల్లో నటించి.. సినీ ఇండస్ట్రీలో అలాగే ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది. విభిన్నమైన కంటెంట్‌తో జనాల ముందుకొచ్చి.. ఎంటర్‌టైన్ చేశారు. టైమింగ్ పంచులతో, కామెడీ సీన్స్‌తో వెంకీ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకున్నాడు.

మూవీ హిట్ అయినా.. కాకపోయినా అన్ని డేస్‌ను యాక్సెప్ట్ చేస్తూ ఈ స్థాయికి వచ్చారు. బ్రహ్మపుత్రుడు, పవిత్రబంధం, ప్రేమించుకుందాం రా, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, ఎఫ్ 3, నువ్వు నాకు నచ్చావ్ వంటి సినిమాల్లో నటించి.. నెటిజన్లను ఆకట్టుకున్నాడు.

సంక్రాంతి పండుగకు వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇందులో మీనాక్షి చౌదరి అండ్ ఐశ్వర్య రాజేష్ కథానాయికలుగా నటించి తెలుగు ప్రేక్షకుల మనసు దోచేశారు. ఈ మూవీలోని సాంగ్స్ అన్నీ కూడా ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి.

సంక్రాంతికి విడుదలైన సినిమాల్లో ఈ మూవీనే అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా నిలిచిందని చెప్పుకోవచ్చు. ఇకపోతే వెంకటేష్ తరచూ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో మంచి మాటలు రాసుకొస్తారన్న విషయం తెలిసిందే. నేడు ఈ హీరో ‘ఇతరులను నిందించకండి, మిమ్మల్ని మీరు మెరుగుపరచుకోండి’. అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం వెంకీ ఇన్‌స్ట్రాగ్రామ్ స్టోరీ నెట్టింట వైరల్ అవుతోంది.

Next Story