Project-23: చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుందా.. ఆసక్తికరంగా 23 పోస్టర్

by Chukka Sudharani |

తేజ, తన్మయి, ఝాన్సీ, పావోన్ రమేష్, తాగుబోతు రమేష్, ప్రణీత్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు రాజ్ ఆర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘23’.

Project-23: చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుందా.. ఆసక్తికరంగా 23 పోస్టర్
X

దిశ, సినిమా: తేజ, తన్మయి, ఝాన్సీ, పావోన్ రమేష్, తాగుబోతు రమేష్, ప్రణీత్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు రాజ్ ఆర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘23’. నిజమైన సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ మూవీని స్టూడియో ౯౯ (Studio 99) నిర్మింస్తుండగా.. రానా దగ్గుబాటి (Rana Daggubati) స్పిరిట్ మీడియా డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ సందర్భంగా, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ఫస్ట్ లుక్ (First look) పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఫస్ట్ లుక్ పోస్టర్ చూసినట్లు అయితే.. మంటల్లో చిక్కుకున్న బస్సును, మంటల్లో చిక్కుకున్న వ్యక్తులను, ప్రాణాల కోసం తీవ్రంగా పరిగెత్తుతున్న ప్రజలను చూపిస్తుంది. అలాగే.. గోనె సంచులలో బంధించబడిన వ్యక్తులను కూడా చూపిస్తోంది. జార్జ్ ఆర్వెల్ రాసిన ప్రసిద్ధ కోట్ ‘All are equal, but some are more equal than others,"paired with the movie's tagline"అనే సినిమా ట్యాగ్‌లైన్‌తో జతచేయడం ప్రేక్షకులను ఆకర్షిస్తుంది. అలాగే "మన సమాజంలో చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుందా..?" సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. కాగా.. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను నిర్మాతలు త్వరలో విడుదల చేయనున్నట్లు తెలిపారు.

Next Story