ఒకే పాత్రలో 144 సార్లు.. గిన్నిస్ రికార్డ్ సృష్టించిన ఆ నటుడు ఎవరో తెలుసా?

by Jakkula.Mamatha |   (  Updated:2025-11-25 11:05:46  IST  )

సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ప్రతి ఒక్కరు విభిన్న పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకుల మనసులు దోచేస్తుంటారు.

ఒకే పాత్రలో 144 సార్లు.. గిన్నిస్ రికార్డ్ సృష్టించిన ఆ నటుడు ఎవరో తెలుసా?
X

దిశ,వెబ్‌డెస్క్: సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ప్రతి ఒక్కరు విభిన్న పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకుల మనసులు దోచేస్తుంటారు. సినీ నటుల అద్భుతమైన ప్రదర్శన కళకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే.. ఒక నటుడు ఒకే పాత్రలో ఎక్కువ సినిమాల్లో కనిపిస్తే కొందరు అభిమానులు అసహనం వ్యక్తం చేస్తారు. వేరే స్టైల్లో, మరో పాత్రలో కనిపిస్తే బాగుండు అనుకుంటారు. ఇక, మరికొందరైతే ‘మూస’ నటుడు అని కామెంట్ కూడా చేస్తారు. దీంతో సినీ నటులు అభిమానుల మనసులు గెలుచుకోవడానికి విభిన్న పాత్రలతో పరిచయమవుతారు.

కానీ.. ఓ బాలీవుడ్ నటుడు తాను చేసిన సినిమాల్లో ఎక్కువగా ఒకే పాత్రలో కనిపిస్తారు. అంతేకాదు ఒకే పాత్రలో నటిస్తూ ప్రేక్షకాభిమానుల మనసులు దోచుకున్నాడు. అతను ఎవరో కాదు బాలీవుడ్ నటుడు జగదీష్ రాజ్ ఖురానా. హిందీ నటుడు జగదీశ్ రాజ్ ను బాలీవుడ్ ‘ఇన్‌స్పెక్టర్ సాబ్’ అని పిలిచే వారు. ఎందుకంటే ఆయన 144 సినిమాల్లో పోలీస్ పాత్రల్లోనే కనిపించి గిన్నిస్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల్లో నమొదయ్యారు.

సుమారు 260 చిత్రాలు చేసిన ఈయన.. పోలీస్ పాత్రలతో పాటు విలన్, న్యాయమూర్తి లాంటి ఇతర పాత్రల్లోనూ కనిపించారు. కానీ ఈయన సినీ పోలీస్‌గానే అందరికీ గుర్తుండిపోయారు. జగదీష్ రాజ్ 2013లో శ్వాసకోశ సమస్యలతో తుదిశ్వాస విడిచారు. అయితే.. సినీ జీవితంలో ఒకే పాత్రను 144 సార్లు పోషించడం అనేది ప్రస్తుత నటులకు దాదాపు అసాధ్యమైన ఘనతే అంటూ నెట్టింట్లో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.

Next Story