Rajamouli: కష్టాల్లో ఉన్న సమయంలో రాజమౌళికి సహాయం చేసిందెవరో తెలుసా.. అందుకే ఇప్పటికీ కృతజ్ఞత

by Pulgam srinivas |

కెరీర్ ప్రారంభంలో రాజమౌళి డబ్బులు లేక ఎన్నో ఇబ్బందులు పడగా, రాఘవేంద్రరావు ఆయనకు చాలా సహాయం చేశాడు. దాంతో ఇప్పటికీ రాజమౌళి ఆయనకు కృతజ్ఞత చూపుతున్నాడు.

Rajamouli: కష్టాల్లో ఉన్న సమయంలో రాజమౌళికి సహాయం చేసిందెవరో తెలుసా.. అందుకే ఇప్పటికీ కృతజ్ఞత
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినిమా పరిశ్రమలో 100% విజయాలతో కెరీర్ను ముందుకు సాగిస్తున్న అత్యంత తక్కువ మంది దర్శకులలో రాజమౌళి ముందు వరుసలో ఉంటారు. చాలా సంవత్సరాల క్రితం 'స్టూడెంట్ నెంబర్ 1' చిత్రంతో దర్శకుడిగా సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి అన్నింటితో విజయాలను అందుకున్నారు. 'మగధీర' సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో దిగ్గజ దర్శకులలో ఒకరిగా పేరు తెచ్చుకున్న ఈ డైరెక్టర్ బాహుబలి సిరీస్ మూవీలతో ఇండియా వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నారు. ఇక 'ఆర్ఆర్ఆర్'తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును దక్కించుకున్నారు.

ఇప్పుడు మన ఇండియాలోనే టాప్ దర్శకులలో ఈయన ఒకరు. ఇంతలా గుర్తింపును సంపాదించుకున్న రాజమౌళి కెరీర్ ప్రారంభంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారట, ఒకానొక సమయంలో చేతిలో డబ్బులు లేక ఎన్నో కష్టాలను కూడా అనుభవించారట. అలాంటి కష్టాల్లో ఉన్న సమయంలో ఆయనకు ఒకరు డబ్బులు ఇచ్చి సహాయం చేశారట, దానితో ఆయన చేసిన సహాయాన్ని ఇప్పటికీ మరవకుండా రాజమౌళి కృతజ్ఞత చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇంతకు రాజమౌళికి అంతలా సహాయం చేసిన ఆ వ్యక్తి ఎవరో తెలుసా? ఆయన మరెవరో కాదు తెలుగు దిగ్గజ దర్శకులలో ఒకరైన దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు.

రాజమౌళి సినీ ప్రస్థానంలో రాఘవేంద్రరావు కీలక పాత్ర పోషించారు. ఈయన దర్శకత్వంలో రూపొందిన ఎన్నో సినిమాలకు రాజమౌళి పనిచేశారు. అలాంటి సమయంలోనే 'స్టూడెంట్ నెంబర్ 1' సినిమాకు దర్శకత్వం వహించే అవకాశాన్ని ఆయనకు ఇప్పించారు. అలాగే డబ్బు లేక ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్న సమయంలో చాలాసార్లు రాజమౌళికి డబ్బు సహాయం కూడా చేశారట. దానితో ఇప్పటికీ కూడా రాజమౌళి, రాఘవేంద్రరావుపై కృతజ్ఞతలు చూపుతూనే ఉంటారు. ప్రస్తుతం రాజమౌళి, మహేష్ బాబు హీరోగా, ప్రియాంక చోప్రా హీరోయిన్గా వారణాసి అనే చిత్రాన్ని రూపొందిస్తున్నాడు.

Next Story