Naga Chaithanya కంటే ముందు.. Samantha ను పెళ్లి చేసుకోవాలనుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?

by Disha Web Desk 6 |
Naga Chaithanya కంటే ముందు.. Samantha ను పెళ్లి చేసుకోవాలనుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ క్యూట్ కపుల్ నాగచైతన్య-సమంత ‘ఏ మాయ చేసావే’ సినిమా తర్వాత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత మనస్పర్థలు వచ్చి విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం విడివిడిగా ఉంటూ కెరీర్‌పై దృష్టి పెట్టి వరుస చిత్రాల్లో నటిస్తున్నారు. తాజాగా, సమంతను పెళ్లికి ముందే ఓ టాలీవుడ్ స్టార్ హీరో ప్రేమించాడని వార్తలు వినిపిస్తున్నాయి. అతనెవరో కాదు.. బొమ్మరిల్లు సినిమాతో స్టార్ హీరోగా మారిన సిద్ధార్థ్ సమంతను గాఢంగా ప్రేమించాడట. అతడి మాటలకు సమంత కూడా పడిపోయిందని తెలుస్తోంది. అయితే సిద్దూ సామ్‌ను పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాడట. అప్పట్లో వీరిద్దరూ కలిసి కాళహస్తి గుడిలో పూజలు చేసిన ఫొటోలు కూడా బయటకు రావడంతో వారి ప్రేమ నిజమేనని అందరూ అనుకున్నారు. కానీ, ఆ తర్వాత సమంత చైతన్యకు దగ్గర అవ్వడం వల్ల సిద్ధార్థ్ దూరం అయ్యాడని తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన నెటిజన్స్ అతడిని పెళ్లి చేసుకున్నా నీ లైఫ్ బాగుండేదేమో అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి: ప్రభాస్ పై ప్రేమను మరోసారి ఆ విధంగా చూపించిన అనుష్క





Next Story

Most Viewed