- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
The Paradise : బడ్జెట్ తెలిస్తే భయం పుట్టాల్సిందే
The Paradise : ది ప్యారడైజ్ చిత్రాన్ని 200 కోట్ల ఖర్చుతో రూపొందిస్తున్నట్లు సమాచారం.

దిశ, వెబ్ డెస్క్ : కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్లినట్లయితే మన టాలీవుడ్ స్టార్ హీరోలు నటించిన సినిమాలకు కూడా 100 కోట్ల బడ్జెట్ను కేటాయించేవారు కాదు. కానీ ఎప్పుడైతే బాహుబలి సినిమా వచ్చి ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్లను కొల్లగొట్టిందో అప్పటినుండి నిర్మాతలు భారీ బడ్జెట్ను పెట్టడానికి పెద్దగా వెనకడుగు వేయడం లేదు. స్టార్ హీరోల విషయం పక్కనపెడితే మీడియం రేంజ్ హీరోల విషయంలో కూడా నిర్మాతలు డేరింగ్ స్టెప్ తీసుకుంటున్నారు. అందులో భాగంగా ప్రస్తుతం నాని నటిస్తున్న ది ప్యారడైజ్ కోసం కూడా పెద్ద ఎత్తున ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది.
నాని ఇప్పటివరకు నటించిన ఏ సినిమాకు రాని కలెక్షన్ల రేంజ్ బడ్జెట్ను ఈ సినిమాకు కేటాయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి 200 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఈ రేంజ్ బడ్జెట్ అంటే మామూలు విషయం కాదు. ఒకవేళ ఇంత మొత్తం రికవరీ అయ్యి నిర్మాతకు లాభాలు వచ్చాయి అంటే నాని కెరియర్లో ఇదొక ల్యాండ్ మార్క్ మూవీగా మిగిలిపోతుంది. అదే ఏదైనా తేడా కొట్టింది అంటే నాని కెరియర్కు ఇది పెద్ద రిస్క్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.
ఈ సినిమాను మొదట మార్చి 26న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత విడుదల వాయిదా పడింది. ప్రస్తుతానికి ఈ సినిమాని ఆగస్టు 21న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. మోహన్ బాబు, సంపూర్ణేష్ బాబు, సోనాలి కులకర్ణి తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.






