‘యానిమల్’ సినిమాకు భారీగా పెంచేసిన రష్మిక.. ఎంత రెమ్యునరేషన్ తీసుకుందో తెలుసా?

by Disha Web Desk 6 |
‘యానిమల్’ సినిమాకు భారీగా పెంచేసిన రష్మిక.. ఎంత రెమ్యునరేషన్ తీసుకుందో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: నేషనల్ క్రష్ రష్మిక ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా ఈ అమ్మడు బోలేడన్ని ఆఫర్స్‌ను దక్కించుకుంటూ దూసుకుపోతుంది. ఇప్పుడు సందీప్ వంగా దర్శకత్వం వహిస్తున్న ‘యానిమల్’ సినిమాతో రాబోతుంది. ఇందులో రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్ అంచనాలు భారీగా పెంచేశాయి.

డిసెంబర్ 1వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో ఇప్పటికే చిత్ర బృందం షూటింగ్ శరవేగంగా జరుపుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాలో నటీనటుల పారితోషికం మరింత హాట్ టాపిక్ గా మారింది. రణబీర్ ఈ చిత్రంలో నటించడానికి ఏకంగా రూ. 70 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నాడట. అలాగే రష్మిక మందన్నా రూ. 4 కోట్లు తీసుకుందని తెలుస్తోంది. దక్షిణాదిలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న నటీమణుల్లో ఒకరిగా రాణిస్తున్న ఈ అమ్మడు యానిమల్‌కు ముందుకంటే భారీగా పారితోషికం పెంచేసిందట. ఈ సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో కూడా విడుదల కాబోతోంది. మరి ఈ సినిమా రష్మిక కెరీర్ కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

Read More : రష్మికను బ్రా విప్పేయమంటూ నీచంగా మాట్లాడిన స్టార్ డైరెక్టర్?

Next Story

Most Viewed