అల్లు అర్జున్- శ్రీజ హీరోయిన్‌గా బ్లాక్ బస్టర్ సినిమా..పేరెంటో తెలుసా?

by Disha Web Desk 6 |
అల్లు అర్జున్- శ్రీజ హీరోయిన్‌గా బ్లాక్ బస్టర్ సినిమా..పేరెంటో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌లో మెగా హీరోలకు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. వాళ్లలో అల్లు అర్జున్‌కు ఐకాన్ స్టార్‌గా మంచి పాపులారిటీ ఉంది. ప్రెసెంట్ మెగా ఫ్యామిలీ ట్యాగ్ వద్దంటున్నాడు కానీ మొదట్లో మాత్రం మెగా ఫ్యామిలీ ట్యాగ్ ని ఉపయోగించుకొని సినిమా అవకాశాలు సంపాదించుకున్నాడు. తాజాగా, సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న వార్త ప్రకారం.. బన్నీ, హీరోగా మెగాస్టార్ చిన్న కూతురు శ్రీజ కాంబినేషన్‌లో ఓ బ్లాక్ బస్టర్ సినిమా మిస్ అయిందట. కానీ చిరంజీవికి ఇష్టం లేని కారణంగా ఈ సినిమాను మొదట్లోనే ఆపేశారట.

ఆ సినిమా మరేదో కాదు.. గంగోత్రి. బన్నీ హీరోగా ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్న టైంలో రాఘవేంద్రరావు గారి దగ్గరికి వెళ్లి అల్లు అరవింద్ స్పెషల్ రిక్వెస్ట్ మీద గంగోత్రి సినిమాను డైరెక్టర్ చేయమని చెప్పుకొచ్చారట. ఈ క్రమంలో కొత్త బ్యూటీని హీరోయిన్‌గా తీసుకుంటేనే అల్లు అర్జున్ సినీ కెరీర్ బాగుంటుందని అల్లు అరవింద్ అనుకున్నారట. అందుకే శ్రీజను తీసుకున్నారట. ఆ తర్వాత చిరంజీవికి తెలియడంతో ఆయన వద్దంటే వద్దు అని మెండిగా వాదించి శ్రీజను హీరోయిన్ కాకుండా చేశాడట. ఆ తర్వాత ఆ ప్లేస్ లోకి ఆర్తి అగర్వాల్ చెల్లెలు అతిథి అగర్వాల్ వచ్చింది



Next Story

Most Viewed