అందరూ యోగా డేను సెలబ్రేట్ చేసుకోవాలి: సాయి దుర్గా తేజ్

by Yella Dhawani Reddy |   (  Updated:2025-06-20 15:25:27  IST  )

ఈనెల 21 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా యోగా డే వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు.

అందరూ యోగా డేను సెలబ్రేట్ చేసుకోవాలి: సాయి దుర్గా తేజ్
X

దిశ, వెబ్ డెస్క్: ఈనెల 21 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని (International Yoga Day) పురస్కరించుకుని దేశవ్యాప్తంగా యోగా డే వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో భాగంగా శుక్రవారం (జూన్ 20) హైదరాబాద్‌లోని (Hyderabad) ఎల్‌బి స్టేడియంలో యోగా సెషన్‌ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు భారీ సంఖ్యలో హాజరై యోగాసనాలు వేశారు. వీరితో పాటు సినీ తారలు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్ (Mega Supreme Hero Sai Durga Tej) యోగా డే గురించి మీడియాతో మాట్లాడారు. భారతీయ సంస్కృతిలో యోగాకు ప్రత్యేకమైన స్థానం ఉందన్నారు. ప్రపంచానికి యోగాను భారతదేశం బహుమతిగా అందించిందని, అంతటి గొప్ప యోగా డేను అందరం కచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరు రోజు యోగా చేయాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.

Click For Twitter Post..

Next Story