- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
“మనసు చెప్పిందే చేయాలి”.. శోభిత ఎమోషనల్ కామెంట్ వైరల్
“మనసు చెప్పిన దారినే నడవాలి. అలా చేసినప్పుడే జీవితంలో అర్థవంతమైన క్షణాలు వస్తాయి” అంటూ శోభిత ధూళిపాళ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: శోభిత ధూళిపాళ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. హిందీ, తెలుగు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న ఆమె, అనంతరం నాగచైతన్యను ప్రేమించి వివాహం చేసుకుంది. ప్రస్తుతం వీరి దాంపత్య జీవితం సంతోషంగా కొనసాగుతోంది. వివాహం తర్వాత శోభిత సినిమాల ఎంపికలో కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఇటీవల శోభిత చేసిన ఓ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దుబాయ్‌కు చెందిన తెలుగు ఇన్‌ఫ్లుయెన్సర్ శ్రీలత అడెపల్లి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన తెలుగు మహిళల గురించి ఓ ప్రత్యేక వీడియోను షేర్ చేశారు.
అందులో శోభిత ధూళిపాళతో పాటు మరికొందరు ప్రముఖ మహిళల గురించి శ్రీలత ప్రస్తావించింది. ఈ పోస్ట్‌పై స్పందించిన శోభిత, మనసు చెప్పిన దారిలోనే నడవాలని, జీవితంలో నిజాయితీగా ఉండాలని, ముందుగా మనల్ని మనం గౌరవించుకోవాలని పేర్కొన్నారు. “మనసు చెప్పిందే చేస్తేనే జీవితంలో అర్థవంతమైన క్షణాలు వస్తాయి” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు నెటిజన్లను ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన తెలుగు మహిళలు ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం ఎంతో గొప్ప విషయమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.






