సెలబ్రిటీ అయితే రూల్స్ వర్తించవా? తమన్నా చేసిన పనికి నెటిజన్లు ఫైర్

by Mallepaka Hamsa |

నీటిపై ప్రయాణించేటప్పుడు కనీస భద్రతా నియమాలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

సెలబ్రిటీ అయితే రూల్స్ వర్తించవా? తమన్నా చేసిన పనికి నెటిజన్లు ఫైర్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా ఓ వివాదంలో చిక్కుకున్నారు. ముంబైలో ఆమె చేసిన ఓ బోటు ప్రయాణం వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు ఆమె ప్రవర్తనపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. సరదాగా చేసిన ఈ రైడ్ తమన్నాను విమర్శలకు గురి చేస్తోంది. ఈ వైరల్ వీడియోలో తమన్నా చాలా సింపుల్‌గా ఒక టీషర్ట్, బ్లూ జీన్స్ ధరించి కనిపించారు. ఆమె లుక్ చాలా బాగుందంటూ కొందరు అభిమానులు కామెంట్లు పెడుతున్నప్పటికీ, మరికొందరు మాత్రం ఆమెపై ఫైర్ అవుతున్నారు. దానికి ప్రధాన కారణం.. బోట్‌లో ప్రయాణిస్తున్న సమయంలో తమన్నా ఎలాంటి లైఫ్ జాకెట్ ధరించకపోవడమే. నీటిపై ప్రయాణించేటప్పుడు కనీస భద్రతా నియమాలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల జబల్‌పూర్‌లో జరిగిన ఒక ఘోర బోటు ప్రమాదంలో 13 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని ఈ సందర్భంగా నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. అలాంటి ప్రమాదాలు జరుగుతున్నా సెలబ్రిటీలు ఇంకా కళ్లు తెరవకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కోట్ల మంది ఫాలోవర్లు ఉండే సెలబ్రిటీ హోదాలో ఉన్నవారు, ఇలాంటి పబ్లిక్ ప్రదేశాల్లో ప్రయాణించేటప్పుడు రూల్స్ పాటిస్తూ అభిమానులకు ఆదర్శంగా నిలవాల్సింది పోయి ఇలా చేయడమేంటని మండిపడుతున్నారు. కేవలం స్టైల్ కోసం, ఫోటోల కోసం ప్రాణాలను రిస్క్‌లో పెట్టడమే కాకుండా.. సమాజానికి తప్పుడు సందేశం ఇవ్వడం కరెక్ట్ కాదంటూ సోషల్ మీడియా వేదికగా తమన్నాకు గట్టిగానే క్లాస్ పీకుతున్నారు. ఇక ఈ విషయంపై ఆమె ఎలా స్పందిస్తుందో చూడాలి.

Next Story