- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
DNA: మరోసారి సత్తా చాటిన డబ్బింగ్ మూవీ.. కథ ఉంటే సక్సెస్ కన్ఫర్మ్ అంటున్న నిర్మాతలు
తమిళంలో ఘన విజయం సాధించిన ‘డీఎన్‌ఏ’ సినిమా తెలుగులో ‘మై బేబి’ పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

దిశ, సినిమా: తమిళంలో ఘన విజయం సాధించిన ‘డీఎన్‌ఏ’ సినిమా తెలుగులో ‘మై బేబి’ పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. నెల్సన్ వెంకట్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఎమోషనల్ డ్రామాలో నిమిషా సజయన్, అథర్వ మురళీ కీలక పాత్రల్లో నటించారు. ఇక మూవీ ఎస్‌కె పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మాత సురేష్ కొండేటి తెలుగు ప్రేక్షకులకు అందించగా.. జులై 18న రిలీజైనా ఈ మూవీ తెలుగు కూడా మంచి టాక్ సొంతం చేసుకుంది.
ఈ మేరకు చిన్న చిత్రంగా వచ్చిన ‘మై బేబీ’ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో 35 లక్షల రూపాయలు వసూళ్లు చేసి, ఇటీవల విడుదలైన చిన్న సినిమాల్లో పెద్ద విజయాన్ని సాధించింది. ఈ సినిమా అమ్మ తాలూకు ప్రేమను, నాన్న తాలూకు బాధ్యతను కలిపిన కథగా మంచి పేరు తెచ్చుకుంది. ఇర కొన్ని రోజుల విరామం తర్వాత మళ్లీ తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఎస్.కె. పిక్చర్స్.. ఈ సినిమాతో మరోసారి విజయం అందుకోవడంతో.. ఇంతటి గొప్ప విజయం ఇచ్చినందుకు, మళ్లీ మా ప్రయాణాన్ని ప్రారంభించే భరోసా కలిగించినందుకు తెలుగు ప్రేక్షకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు అని తెలిపారు.






