Dixit Shetty : ఈ పాత్ర కోసం చాలా ప్రిపేర్ అయ్యా.. ‘ది గర్ల్ ఫ్రెండ్’ మూవీపై దీక్షిత్ శెట్టి

by Chukka Sudharani |

రశ్మిక మందన్న, దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న ‘ది గర్ల్ ఫ్రెండ్’

Dixit Shetty : ఈ పాత్ర కోసం చాలా ప్రిపేర్ అయ్యా.. ‘ది గర్ల్ ఫ్రెండ్’ మూవీపై దీక్షిత్ శెట్టి
X

దిశ, సినిమా: రశ్మిక మందన్న, దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న ‘ది గర్ల్ ఫ్రెండ్’ మూవీ ఈ నెల 7న హిందీ, తెలుగులో.. 14న తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతోంది. ఇందులో భాగంగా తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొని ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ పంచుకున్నాడు హీరో దీక్షిత్. ‘దసరా మూవీ తర్వాత నాకు వచ్చిన అవకాశమిది. "ది గర్ల్ ఫ్రెండ్" మూవీలో బాయ్ ఫ్రెండ్ క్యారెక్టర్ కోసం దర్శకుడు రాహుల్ రవీంద్రన్ నన్ను అప్రోచ్ అయ్యారు. స్క్రిప్ట్ చదివాక నన్ను ఈ క్యారెక్టర్ కోసం ఎందుకు అనుకుంటున్నారో అర్థమైంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళం భాషల్లో స్క్రిప్ట్స్ వింటుంటా.

"ది గర్ల్ ఫ్రెండ్" లాంటి స్క్రిప్ట్స్ చాలా అరుదుగా వస్తుంటాయి. అందుకే ఈ సినిమాను తప్పకుండా చేయాలని అనుకున్నా. ఈ సినిమాలో విక్రమ్ క్యారెక్టర్ ఎలా ఉండాలో దర్శకుడు రాహుల్‌కు పూర్తి క్లారిటీ ఉంది. విక్రమ్ ఎలా ఉంటాడు, అతని బాడీ లాంగ్వేజ్ ఏంటి, ఎలా మాట్లాడుతాడు అనేది రాహుల్ వివరంగా చెప్పేవారు. ఆయనకు ఉన్న క్లారిటీ వల్ల విక్రమ్ క్యారెక్టర్‌ను పర్‌ఫార్మ్ చేయడం నాకు ఈజీ అయ్యింది. అనేక లేయర్స్ ఉన్న ఈ పాత్ర కోసం చాలా ప్రిపేర్ అయ్యా. ఇప్పటి వరకు మనం ఒక తరహాలో సాగే ప్రేమ కథా చిత్రాల్ని చూసి ఉంటాం. "ది గర్ల్ ఫ్రెండ్" సినిమా ప్రేమ కథని మరో కోణంలో చూపిస్తుంది. మనం ఎంటర్‌టైన్మెంట్ కోసం సినిమాలు చూస్తుంటాం. కానీ కొన్ని సినిమాల్లోని ఫీల్ మనతో పాటే క్యారీ అవుతుంది.

మనం ఆ సినిమా నుంచి ఏదో ఒకటి తీసుకెళ్తాం. అలాంటి సినిమా ఇది. రశ్మిక ఈ సినిమా కోసం ఇచ్చిన ఇంటర్వ్యూస్‌లో "ది గర్ల్ ఫ్రెండ్" లాంటి సినిమా కొన్నేళ్ల కిందట తాను చూసి ఉంటే తన జీవితం పట్ల తన దృక్పథం మరోలా ఉండేది అని చెప్పారు. 18 నుంచి 25 ఏళ్ల యూత్ ఈ సినిమా చూస్తే తమ లైఫ్ లో కొన్ని విషయాలు నేర్చుకుంటారు.. అలాగే ఈ సినిమా యూత్ కోసమే కాదు ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కూడా బాగా నచ్చుతుంది. ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యే మంచి క్యారెక్టర్స్ మా మూవీలో ఉన్నాయి. కచ్చితంగా అందరిని ఆకట్టుకుంటోంది’ అని తెలిపారు.

Next Story